News February 24, 2025

తండ్రి చనిపోయిన దు:ఖంలోనూ రచయితకు ప్రభాస్ సాయం!

image

హీరో ప్రభాస్‌పై ‘బిల్లా’ రచయిత తోట ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘నేను 2010 FEBలో ఆస్పత్రిపాలయ్యా. అదేరోజు ప్రభాస్ గారి తండ్రి సూర్య నారాయణ రాజు గారు చనిపోయారు. దుఖంలో ఉన్నప్పటికీ ఆయన నా వైద్యం కోసం డబ్బులు పంపించి హెల్ప్ చేశారు. నాపట్ల అంత కేర్ తీసుకున్నారాయన. తండ్రిని కోల్పోయినప్పటికీ నా సినిమా రైటర్ అని నా గురించి ఆలోచించారు’ అని తనకు ప్రభాస్ చేసిన సాయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

Similar News

News February 24, 2025

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

image

ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచులో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో బంగ్లా విజయంపైనే పాకిస్థాన్ CT సెమీస్ ఆశలు ఆధారపడి ఉన్నాయి.
NZ: యంగ్, కాన్వే, విలియమ్సన్, రవీంద్ర, లాథమ్, ఫిలిప్స్, బ్రాస్ వెల్, సాంట్నర్, హెన్రీ, జెమీసన్, ఓరౌర్కే.
BAN: హసన్, శాంటో, మిరాజ్, హృదయ్, ముష్ఫికర్, మహ్మదుల్లా, జాకర్, రిషద్, తస్కిన్, రాణా, రహ్మన్.

News February 24, 2025

ఆర్టీసీలో కాంట్రాక్ట్ డ్రైవర్ల నియామకాలు

image

TG: ఆర్టీసీలో డ్రైవర్ల కొరతను తగ్గించేందుకు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకానికి సంస్థ సిద్ధమైంది. ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజిలో నమోదైన వారిని నియమించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు 1,500 మంది నియామకానికి సర్క్యులర్ జారీ చేసింది. 4 నెలల కాలానికే వీరిని నియమించనున్నట్లు పేర్కొంది. గత ఏడాది 3వేల డ్రైవర్ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు చేసినా నియామక ప్రక్రియ ఆలస్యమవుతోంది.

News February 24, 2025

లక్ష ఉద్యోగాల భర్తీకి సిద్ధం: టీపీసీసీ చీఫ్

image

TG: ఉద్యోగాల గురించి బీజేపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో భర్తీ చేసిన ఉద్యోగాలు 50 వేలు కూడా దాటలేదని విమర్శించారు. నిజామాబాద్‌లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం 9 నెలల్లోనే 55వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని చెప్పారు. మరో లక్ష ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

error: Content is protected !!