News July 29, 2024
మెరూన్ డ్రెస్లో ప్రభాస్.. ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా?

మారుతి తెరకెక్కిస్తోన్న ‘రాజా సాబ్’ సినిమా నుంచి నిన్న రిలీజైన పోస్టర్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మెరూన్ రంగు సూట్తో కనిపించారు. దీంతో ఆ కలర్ డ్రెస్సులతో ప్రభాస్ నటించిన సినిమాలను ఫ్యాన్స్ గుర్తుచేసుకుంటున్నారు. ‘బాహుబలి’తో పాటు ‘కల్కి’ సినిమాలోనూ ప్రభాస్ మెరూన్ రంగు డ్రెస్ ధరించగా రెండూ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. దీంతో ఇదే ట్రెండ్ ‘రాజా సాబ్’లోనూ కంటిన్యూ అవుతుందని అభిప్రాయపడుతున్నారు.
Similar News
News March 8, 2025
నటుడు మృతి.. కారణం ఇదే

హాలీవుడ్ నటుడు హాక్మన్, అతని భార్య అమెరికాలోని ఇంట్లో అనుమానాస్పద స్థితిలో <<15598233>>చనిపోయిన <<>>సంగతి తెలిసిందే. వారి మృతదేహాలకు నిర్వహించిన పోస్టుమార్టం పరీక్షలో అతడు గుండె జబ్బు, అల్జీమర్స్తో చనిపోయినట్లు తేలింది. అతని భార్య హాంటావైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఊపిరితిత్తులు దెబ్బతిని మరణించిందని గుర్తించారు. అటు భార్య అనారోగ్యంతో వారం క్రితం మృతి చెందిన విషయం హాక్మన్కు తెలియదని సమాచారం.
News March 8, 2025
IPLకు పాకిస్థాన్ ప్లేయర్ ఆమిర్?

IPL 2026 వేలంలో తన పేరు నమోదు చేసుకుంటానని పాకిస్థాన్ స్టార్ బౌలర్ మహ్మద్ ఆమిర్ తెలిపారు. వేలంలో ఎంపికైతే తన బెస్ట్ ఇస్తానని చెప్పారు. ECB తరఫున వేలంలో రిజిస్టర్ చేసుకుంటానని వెల్లడించారు. కాగా ఆమిర్ భార్య నర్జిస్ బ్రిటిష్ పౌరురాలు. అతడికి కూడా ఆ దేశ పౌరసత్వం వచ్చింది. దీంతో ECB తరఫున ఆయన వేలంలో పేరు నమోదు చేసుకోవచ్చు. కాగా IPLలో పాకిస్థాన్ ప్లేయర్లపై నిషేధం ఉన్న విషయం తెలిసిందే.
News March 8, 2025
అమెరికా వీసా ట్రై చేసేవారికి బ్యాడ్ న్యూస్

US వెళ్లాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్. ఆ దేశపు వీసా లేదా గ్రీన్ కార్డుకు అప్లై చేసుకోవాలంటే ఇకపై సోషల్ మీడియా వివరాలూ సమర్పించాల్సి ఉంటుంది. అమెరికా హోంశాఖ ఈ విషయాన్ని ఇటీవల ప్రకటించింది. వలసల్ని మరింత కట్టుదిట్టం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. సోషల్ మీడియాలో సందేశాలు, పోస్టులపై సర్కారు నిఘా వేయనున్న నేపథ్యంలో హెచ్-1బీ, ఈబీ-5 కోసం యత్నిస్తున్నవారికి ఇది ఇబ్బందికరంగా మారొచ్చు.