News November 11, 2024
పోలీస్ యూనిఫామ్‌లో ప్రభాస్.. ఆర్ట్ అదుర్స్!

సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న ‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆర్టిస్ట్ హర్ష గీసిన ఆర్ట్ వైరలవుతోంది. కొరియన్ నటుడు డాన్లీ విలన్ పాత్రలో నటిస్తారని వార్తలొస్తుండటంతో ఆయనతో పాటు పోలీస్ యూనిఫామ్‌లో ప్రభాస్ చిత్రాన్ని గీశారు. మూవీలో ప్రభాస్ లుక్ ఇలా ఉంటే అదిరిపోతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News November 10, 2025
రేపే పోలింగ్.. స్కూళ్లు, ఆఫీసులకు సెలవు

TG: రేపు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ నేపథ్యంలో ఆ నియోజకవర్గ పరిధిలో కలెక్టర్ హరిచందన ఇప్పటికే సెలవు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, కార్యాలయాలు, ఐటీ ఆఫీసులకు ఈ హాలిడే వర్తిస్తుంది. అటు ఈ నెల 14న కౌంటింగ్ జరిగే చోట సెలవు ఇవ్వాలని అధికారులు ఆదేశించారు.
News November 10, 2025
ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు

✦ విశాఖలో రియాల్టీ లిమిటెడ్ ఐటీ పార్క్, రహేజా సంస్థ పరిశ్రమ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
✦ ఓర్వకల్లులో డెడికేటెడ్ డ్రోన్ ఇండస్ట్రీస్‌కు 50ఎకరాలు, సిగాచీ సింథటిక్ ఆర్గానిక్ ప్లాంటుకు 100Acre, అనకాపల్లి(D)లో డోస్కో ఇండియాకు 150Acre, అనంతపురంలో TMT బార్ ప్లాంటుకు 300Acre, నెల్లూరులో ఫైబర్ సిమెంట్ ప్లాంట్ కోసం బిర్లా గ్రూపుకు భూమి కేటాయింపు
✦ కృష్ణా(D) బాపులపాడులో వేద ఇన్నోవేషన్ పార్క్(40Acre) ఏర్పాటు
News November 10, 2025
తక్షణ సాయంగా ₹901 కోట్లు ఇవ్వండి: AP

AP: మొంథా తుఫాను నష్టంపై అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందం సచివాలయంలో సమీక్ష నిర్వహించింది. ₹6384CR నష్టం వాటిల్లిందని, ₹901.4 కోట్లు తక్షణ సాయంగా అందించాలని రాష్ట్ర అధికారులు కోరారు. 1.61 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు చెప్పారు. ఉద్యాన, మల్బరీ తోటలూ దెబ్బతిన్నాయని వివరించారు. 4,794KM రోడ్లు, 3,437 మైనర్ ఇరిగేషన్ పనులు, 2,417 ఇతర ప్రాజెక్టులకు నష్టం వాటిల్లిందని తెలిపారు.


