News July 2, 2024
ప్రభాస్‌కు చాలా సిగ్గు: హీరోయిన్

ప్రభాస్‌కు చాలా సిగ్గని, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరని హీరోయిన్ హంసానందిని అన్నారు. ‘మిర్చి సినిమాలో టైటిల్ సాంగ్‌లో నేను నటించా. కానీ ఆ సమయంలో సినిమా చూడలేకపోయా. ఆ తర్వాత ఓ మూవీ షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రభాస్‌ను కలిశా. అప్పుడు సినిమా చూడలేదని ఆయనకు చెప్పడంతో నాకు టికెట్ బుక్ చేసి మరీ సినిమా చూపించారు. నా పాట ఏ టైమ్‌కు వస్తుందో కూడా ఆయన చెప్పారు’ అంటూ ఆమె పేర్కొన్నారు.
Similar News
News January 1, 2026
2026: బీఆర్ఎస్ సెటైరికల్ ట్వీట్

TG: 2026లోకి అడుగుపెడుతున్నామని చెబుతూ ఒక్కో అంకెకు ఒక్కో వివరణ ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై BRS సెటైరికల్ ట్వీట్ చేసింది. ‘2 – రెండేండ్ల సమయం వృథా, 0 – కాంగ్రెస్ అందించిన సంక్షేమ ఫలాలు గుండు సున్నా, 2 – కాంగ్రెస్ ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలేవి?, 6- ఇస్తామన్న గ్యారంటీలు ఎక్కడ?’ అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించింది. ఎన్నెన్నో హామీలిచ్చి, మాయమాటలతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని దుయ్యబట్టింది.
News January 1, 2026
మినుములో మారుకా మచ్చల పురుగు నివారణ(1/2)

మినుము పంట పూత దశలో (35 రోజుల) తప్పనిసరిగా పైరుపై లీటరు నీటిలో 5% వేప గింజల కషాయం లేదా వేపనూనె 5ml కలిపి పిచికారీ చేస్తే రెక్కల పురుగులు గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. వీటి పిచికారీతో మొక్కలపై ఉన్న గుడ్లు కూడా పగిలి చనిపోతాయి.
☛ మొగ్గ, పూత దశలో పిల్ల పురుగులు కనిపిస్తే క్లోరిపైరిఫాస్ 2.5ml లేదా థయోడికార్బ్ 1 గ్రా. లేదా ఎసిఫేట్ 1 గ్రామును లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
News January 1, 2026
కొత్త సంవత్సరంలో మనం చేసే చిన్న పొరపాటు!

క్యాలెండర్ మారుతుంది కానీ.. మన చేతి అలవాటు మారదు. న్యూఇయర్ రోజు ప్రతి ఒక్కరూ చేసే చిన్న పొరపాటు.. తేదీలో పాత ఏడాదిని రాయడం. ఆఫీసు ఫైళ్లు, పుస్తకాలపై పొరపాటున పాత ఏడాదిని రాసి ఆపై నాలుక కరుచుకుని కొట్టివేయడం చేస్తూనే ఉంటాం. ఫోన్లు ఆటోమేటిక్‌గా అప్డేట్ అవుతున్నా మన పెన్ను మాత్రం పాత ఏడాది వైపే మొగ్గు చూపుతుంది. గుర్తుంచుకోండి ఇక నుంచి 2025 కాదు.. 2026.


