News July 3, 2024
రికార్డుల్ని బ్రేక్ చేస్తున్న ప్రభాస్ ‘కల్కి’

బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’ వసూళ్ల పరంపర కొనసాగుతోంది. 6 రోజుల్లోనే రూ. 700 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ, విజయ్ ‘లియో’, రజనీకాంత్ ‘జైలర్’, సల్మాన్ ‘సుల్తాన్’ లైఫ్‌టైమ్ రికార్డుల్ని బ్రేక్ చేసింది. ఇంకా జోరు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని రికార్డుల్ని సృష్టించవచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. నార్త్ అమెరికాలో ఆమిర్ ఖాన్, రణ్వీర్ సింగ్ రికార్డుల్నీ కల్కి దాటేయడం విశేషం.
Similar News
News March 10, 2026
నేపాల్‌లో RSP ఘన విజయం.. మోదీ కంగ్రాట్స్

నేపాల్ సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలు వెల్లడయ్యాయి. 165 స్థానాలకు గాను రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ 125 చోట్ల గెలిచింది. నేపాలీ కాంగ్రెస్ 18, CPN(UML) 9, నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీ 7, మిగతా పార్టీలు 5 స్థానాలను సొంతం చేసుకున్నాయి. ఓ చోట రిజల్ట్ పెండింగ్‌లో ఉంది. ఘన విజయం సాధించిన RSP ప్రెసిడెంట్ రవి లామిచానే, ప్రధాని అభ్యర్థి బాలెన్ షాతో PM మోదీ ఫోన్లో మాట్లాడారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు.
News March 10, 2026
4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. వారంలో షెడ్యూల్?

అస్సాం, కేరళ, WB, TN, పుదుచ్చేరి(UT)లో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. EC వారంలో షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం CEC జ్ఞానేశ్ కుమార్ ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు. స్థానిక పండుగలను పరిగణనలోకి తీసుకోవాలని పలు పార్టీలు ECకి విజ్ఞప్తి చేశాయి. కాగా బెంగాల్లో ఎన్నికలను రెండు దశల్లోనే పూర్తి చేయాలని TMC, BJP, INC, CPM, AAP నేతలు కోరారు.
News March 10, 2026
ఇండియా వల్ల క్రికెట్ భ్రష్టుపట్టింది: అక్తర్ అక్కసు

భారత్ T20WC గెలవడంపై పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియా ఆధిపత్యం వల్ల ఆట భ్రష్టుపట్టిందని అక్కసు వెళ్లగక్కారు. ‘ఓ రిచ్ కిడ్ తన పక్కనున్న పేదపిల్లలందరినీ పిలిచి క్రికెట్ ఆడదాం అన్నట్లుగా ఉంది ఇండియా వ్యవహారం’ అని విమర్శించారు. ఫైనల్‌కి ముందు కూడా ‘క్రికెట్ మంచి కోసం న్యూజిలాండ్ గెలవాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. ఆయనపై ఇండియన్ ఫ్యాన్స్ SMలో ఫైర్ అవుతున్నారు.


