News February 13, 2025

ప్రభాస్, మోహన్ లాల్ రెమ్యునరేషన్ తీసుకోలేదు: విష్ణు

image

‘కన్నప్ప’ కోసం ఏడేళ్లుగా కష్టపడుతున్నామని, రూ.140 కోట్లతో తెరకెక్కిస్తున్నామని హీరో మంచు విష్ణు తెలిపారు. ప్రభాస్, మోహన్ లాల్ రెమ్యునరేషన్ తీసుకోకుండానే ఈ చిత్రంలో నటించారని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. పారితోషికం గురించి నేను ‘కంప్లీట్ యాక్టర్‌’ వద్ద ప్రస్తావిస్తే ఆయన నవ్వుతూ ‘నువ్వు అంత పెద్దవాడివయ్యావా’ అని అన్నారన్నారు. డార్లింగ్ వల్ల తనకు స్నేహంపై నమ్మకం పెరిగిందని పేర్కొన్నారు.

Similar News

News February 14, 2025

స్టొయినిస్‌పై ఆరోన్ ఫించ్ మండిపాటు

image

ఆస్ట్రేలియా క్రికెటర్ స్టొయినిస్ ODIల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విధానంపై మాజీ క్రికెటర్ ఫించ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రిటైర్మెంట్ నిర్ణయం కచ్చితంగా అతడి ఇష్టం. ఎవరూ తప్పుబట్టరు. కానీ తనపై నమ్మకంతో సెలక్టర్లు ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేశారు. మరి అతడు బాధ్యతగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ముందుగానే చెప్పాలి కదా? అది కచ్చితంగా అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయమైతే కాదు’ అని వ్యాఖ్యానించారు.

News February 14, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 14, 2025

ఫిబ్రవరి 14: చరిత్రలో ఈరోజు

image

1898: స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత దిగవల్లి వేంకటశివరావు జననం
1921: ఆంధ్రప్రదేశ్ రెండో సీఎం దామోదరం సంజీవయ్య జననం
1952: మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ జననం
1974: సినీ దర్శకుడు, నిర్మాత వి.రామచంద్ర రావు మరణం
1983: తెలుగు సినిమా హాస్యనటుడు రాజబాబు మరణం
1984: నటుడు సి.హెచ్. నారాయణరావు మరణం
2019: పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్ల వీరమరణం
☛ ప్రేమికుల దినోత్సవం

error: Content is protected !!