News September 19, 2024
అక్టోబర్ 22న ప్రభాస్ ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ రీ రిలీజ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ మూవీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అక్టోబర్ 22న ఈ మూవీని రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దశరథ్ తెరకెక్కించిన ఈ మూవీలో కాజల్ అగర్వాల్, తాప్సీ పన్ను హీరోయిన్లుగా నటించారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. దిల్ రాజు నిర్మించారు. 2011లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది.
Similar News
News October 15, 2025
ప్రముఖ నటుడు కన్నుమూత

వెటరన్ బాలీవుడ్ యాక్టర్ పంకజ్ ధీర్(68) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన నిన్న తుదిశ్వాస విడిచినట్లు సినీ& TV ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇవాళ సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపింది. 1988-94 మధ్య BR చోప్రా తెరకెక్కించిన ‘మహాభారత్’ టీవీ సీరియల్‌లో కర్ణుడి పాత్రతో పంకజ్ గుర్తింపు పొందారు. పలు బాలీవుడ్ సినిమాలు, టీవీ సీరియళ్లలో ఆయన నటించారు.
News October 15, 2025
బిహార్‌లో 57 మందితో JDU తొలిజాబితా

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు పాలక జనతాదళ్(U) 57 మందితో తొలిజాబితా విడుదల చేసింది. నిన్న NDA కూటమిలోని బీజేపీ 71 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం తెలిసిందే. 2 విడతల్లో జరిగే ఎన్నికల్లో BJP, JDU చెరో 101 సీట్లలో, LJP (R)29, RLM, HAM 6 చొప్పున సీట్లలో పోటీచేయాలని నిర్ణయించాయి. అయితే తమకు సంబంధించిన కొన్ని స్థానాలను LJPకి కేటాయించడంపై JDU అభ్యంతరం చెబుతోంది. ఆ స్థానాల్లో తమ వారికి టిక్కెట్లు ఇచ్చింది.
News October 15, 2025
పత్తి దిగుబడి పెరగాలంటే..

ప్రస్తుతం పత్తి పంట పూత, కాయ తయారీ దశలో ఉంది. మూడు నెలలు పై బడిన పంటకు యూరియా, పొటాష్, కాంప్లెక్స్ వంటి ఎరువులను పైపాటుగా వేయరాదని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ‘పంటపై 10గ్రా. 13:0:45(మల్టీ-కే) లేదా 19:19:19(పాలిఫీడ్) లీటరు నీటికి చొప్పున పిచికారీ చేయాలి. లేదా 20గ్రా. యూరియాను 10-15రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేస్తే కాయ ఎదుగుదల బాగుంటుంది. అధిక దిగుబడి సాధ్యమవుతుంది’ అని పేర్కొంటున్నారు.