News August 3, 2024
ప్రభాస్ కొత్త సినిమా 17న షురూ?

కల్కి సినిమా సూపర్ హిట్‌తో జోరుమీదున్న ప్రభాస్ మరో సినిమాను పట్టాలెక్కించనున్నారు. హను రాఘవపూడి డైరెక్షన్‌లో ఈ నెల 17న మూవీ ప్రారంభించనున్నట్లు టాలీవుడ్ టాక్. ‘ఫౌజీ’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మృణాల్ హీరోయిన్‌గా నటిస్తారని, ప్రభాస్ సైనికుడి పాత్ర పోషిస్తారని సమాచారం. ఇటీవల విడుదలైన రాజాసాబ్ గ్లింప్స్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. డార్లింగ్ నుంచి వరుస అప్డేట్స్‌లో అభిమానులు ఖుషీ అవుతున్నారు.
Similar News
News April 3, 2026
వార్ ఎఫెక్ట్.. భారీగా పెరగనున్న మెడిసిన్ రేట్లు

పశ్చిమాసియా యుద్ధం వల్ల ధరలు పెరిగే జాబితాలో మందులు కూడా చేరుతున్నాయి. ఔషధాల తయారీకి అవసరమయ్యే ముడిపదార్థాల సరఫరాలో తీవ్ర అంతరాయంతో వాటి ధరలు 200-300% పెరిగాయి. దీంతో మెడిసిన్ రేట్లు గరిష్ఠంగా 180% పెరుగుతాయని తెలుస్తోంది. ప్రజలకు త్వరలోనే ఈ బ్యాడ్‌న్యూస్ చెప్పేందుకు ఫార్మా కంపెనీలు సిద్ధమవుతున్నాయి. పారాసెటమాల్, పెయిన్ కిల్లర్స్, యాంటీ బయాటిక్స్, బీపీ టాబ్లెట్స్ ధరలకు రెక్కలు రానున్నాయి.
News April 3, 2026
25 ఏళ్ల వ్యక్తిని పెళ్లి చేసుకున్న 55 ఏళ్ల మహిళ

చైనాకు చెందిన బ్యూటీ ప్రొడక్ట్స్ వ్యాపారవేత్త, బిలియనీర్ యు వెన్‌హాంగ్(55) తన కంటే 30ఏళ్ల చిన్నవాడైన మోడల్‌ను పెళ్లి చేసుకోవడం SMలో వైరల్ అవుతోంది. తన కంపెనీలో పనిచేసిన లియు యుచెన్‌ను 6వ పెళ్లి చేసుకున్నారు. కట్నంగా అతనికి ₹60కోట్లకు పైగా విలువైన ఆస్తులు, కార్లు ఇచ్చారు. ఆమె 45ఏళ్ల వయసులోనూ 25ఏళ్ల యువకుడిని పెళ్లి చేసుకోగా ఆ రిలేషన్ బ్రేక్ అయింది. కాగా ఆమెకు ఇదివరకే ఇద్దరు కొడుకులున్నారు.
News April 3, 2026
ఒత్తైన జుట్టు కోసం ఉసిరి నూనె

మన పూర్వీకులు తరతరాలుగా కురుల ఆరోగ్యం కోసం ఉసిరి నూనెను వాడుతున్నారు. ఈ నూనె వెంట్రుకల కుదుళ్లను బలోపేతం చేస్తుంది. అలాగే కురుల పెరుగుదలను వృద్ధి చేస్తుందంటున్నారు నిపుణులు. ఇందులోని యాంటీ యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ వెంట్రుకలు రాలకుండా చూస్తాయి. కురులు తేమగా, మెరిసేలా చేస్తాయి. అలాగే చుండ్రుతో ఇబ్బంది పడుతుంటే ఉసిరి నూనెలోని యాంటీ మైక్రోబియల్ గుణం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది.


