News May 10, 2024
ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం?
రాజాసాబ్, కల్కి 2898ఏడీ, కన్నప్ప, సలార్-2 సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్. మారుతి డైరెక్షన్లో తెరకెక్కే ‘రాజాసాబ్’ రిలీజ్ మరింత ఆలస్యం కావొచ్చని సినీవర్గాలంటున్నాయి. సలార్-2ను త్వరగా పూర్తి చేయాలని ఆ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భావిస్తున్నారట. దీంతో ఆ షూట్ పూర్తయ్యాకే రాజాసాబ్ షూట్ స్టార్ట్ అవుతుందని సమాచారం. కెరీర్లో ఇప్పటి వరకూ నటించని పాత్రను ప్రభాస్ రాజాసాబ్లో చేయనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News January 8, 2025
ఏసీబీ కార్యాలయంలో ముగిసిన అరవింద్ కుమార్ విచారణ
TG: ఫార్ములా-ఈ కారు రేసు కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏసీబీ విచారణ ముగిసింది. దాదాపు ఆరు గంటల పాటు విచారణ సాగింది. అరవింద్ను ముగ్గురు ఏసీబీ అధికారుల బృందం విచారించింది. విదేశీ కంపెనీకి నగదు బదిలీ వెనుక కారణం, ఎవరి అనుమతితో బదిలీ చేశారు? నగదు బదిలీకి ఆర్బీఐ అనుమతి ఉందా? వంటి ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ను అధికారులు రికార్డు చేసుకున్నారు.
News January 8, 2025
ALERT.. ఇవాళ రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రతలు
TG: ఇవాళ రాత్రి ఉష్ణోగ్రతలు ఈ నెలలోనే కనిష్ఠానికి పడిపోతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. రేపు ఉదయం నార్త్ HYDలో 5-7 డిగ్రీ సెల్సియస్, వెస్ట్ HYDలో 7-9 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుందని తెలిపారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలోని ఇతర జిల్లాల్లోనూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి.
News January 8, 2025
తెలంగాణలో కింగ్ఫిషర్ బీర్లు బంద్: క్రాషైన కంపెనీ షేర్లు
TGకి కింగ్ఫిషర్ సహా <<15097668>>బీర్ల<<>> సరఫరాను సస్పెండ్ చేయడంతో యునైటెడ్ బ్రూవరీస్ షేర్లు ఇంట్రాడేలో 4% మేర పతనమయ్యాయి. 2019 నుంచి కనీస ధరలను పెంచకపోవడమే ఇందుకు కారణం. TG నుంచి రూ.900 కోట్ల బకాయిలు రావాల్సి ఉండటం వర్కింగ్ క్యాపిటల్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. 6 నెలలుగా చెల్లింపులు చేయలేదన్న సమాచారం ఎక్స్ఛేంజీలకు చెప్పడంతో రూ.1920 వద్ద కనిష్ఠాన్ని తాకిన షేర్లు చివరికి రూ.73నష్టంతో రూ.2001 వద్ద ముగిశాయి.