News November 9, 2024
ప్రభాస్.. 3 సినిమాలకు రూ.650 కోట్లు?

కన్నడ నిర్మాణ సంస్థ హోంబలేతో ప్రభాస్ 3 సినిమాలకు అగ్రిమెంట్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందానికి గాను ఆయన రూ.650 కోట్లు తీసుకోనున్నట్లు సినీ ఇండస్ట్రీలో ప్రచారం నడుస్తోంది. సలార్ 2, ప్రశాంత్ వర్మ, లోకేశ్ కనగరాజ్‌లతో తీసే సినిమాలకుగాను ఈ డీల్ ఓకే అయినట్లు సమాచారం. కాగా రెబల్ స్టార్ రాజాసాబ్ చిత్రీకరణ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. తదనంతరం సలార్ 2 షూట్ ప్రారంభించనున్నారు.
Similar News
News December 4, 2025
ములుగు: నన్ను సర్పంచ్‌గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ!

తమను సర్పంచ్‌గా గెలిపిస్తే ప్రతి ఇంటికి వైఫై, ఐదేళ్లు టీవీ ఛానల్స్ పెట్టిస్తానని హామీ ఇచ్చిన ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారంలో జరిగింది. BJP బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ధనలక్ష్మి భర్త చక్రవర్తి పై హామీలతో కూడిన బాండ్ రాసిచ్చారు. పంచాయతీ ఫండ్ ప్రతి రూపాయి ఖర్చు గ్రామస్థులకు తెలియజేస్తానని పేర్కొన్నారు. గోదావరి కరకట్ట లీకేజీలు అరికడతామని, సైడు కాలువలు, కోతుల బెడద నుంచి విముక్తి కలిగిస్తామన్నారు.
News December 4, 2025
కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగులకూ నెలసరి సెలవులు

ప్రభుత్వ రంగంలోని ఉద్యోగులకూ నెలసరి సెలవులను(ఏడాదికి 12) వర్తింపజేస్తూ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల అదనంగా 1.5 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. ప్రైవేట్ రంగాల్లోని మహిళలకు(18-52 ఏళ్లు) పెయిడ్ లీవ్‌ను తప్పనిసరి చేస్తూ గత నెల ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. కాగా బిహార్, ఒడిశా రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగులకు, కేరళలో యూనివర్సిటీ సిబ్బందికి నెలసరి సెలవులు ఇస్తున్నాయి.
News December 4, 2025
ఇలా చేస్తే.. హ్యాకర్లకి చిక్కరు!

రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. హిస్టరీ డిలీట్ చేయడం, ప్రైవేట్ ట్యాబ్ ఉపయోగించడం నిజమైన రక్షణ కాదని నిపుణులు అంటున్నారు. పూర్తిస్థాయి ప్రైవసీ కోసం జీరో-లాగ్ VPN వాడటం వల్ల బ్రౌజ్ చేసేటప్పుడు హిస్టరీ సేవ్ అవ్వదు. బ్రౌజింగ్‌కి వేర్వేరు డివైజ్‌లు ఉపయోగించడం వల్ల డేటా ట్రేస్ చేయడం కష్టం అవుతుంది. కుకీలను బ్లాక్ చేయాలి. ప్రతీ దానికి ఒకే మెయిల్ వాడకూడదు. పాస్‌వర్డ్‌లను మారుస్తూ ఉండాలి.


