News July 4, 2024
‘కల్కి’ హీరో అమితాబేనని ప్రభాస్ అన్నారు: అశ్వనీదత్

‘కల్కి 2898ఏడీ’ సినిమా కలెక్షన్ల వర్షంతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఆ మూవీ హీరో ప్రభాస్పై నిర్మాత అశ్వనీదత్ ప్రశంసలు కురిపించారు. ‘కల్కిలో కమల్ కూడా ఉన్నారని తెలిసి ప్రభాస్ చాలా హ్యాపీ ఫీలయ్యారు. ఇక మూవీకి తొలి హీరో అమితాబే అని, ఆయనకు గౌరవం ఇస్తేనే మనకూ గౌరవమని మాతో అన్నారు. హ్యాట్సాఫ్ టు ప్రభాస్. ఈ సినిమాకు ఆయన పనిచేసిన విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే’ అని పేర్కొన్నారు.
Similar News
News November 12, 2025
ఒక్కో అంతస్తు ఎన్ని అడుగులు ఉండాలి?

ఇంటి నిర్మాణంలో ఒక్కో అంతస్తు ఎత్తు కనీసం 10.5 నుంచి 12 అడుగుల మధ్య ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఈ కొలత పాటించడం వల్ల ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వస్తాయంటున్నారు. ‘ఇది ఇంట్లో ప్రాణశక్తి ప్రవాహాన్ని పెంచి, నివాసితులకు ఉల్లాసాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. తక్కువ ఎత్తు ఉన్న అంతస్తులు నిరుత్సాహాన్ని, ఇరుకుతనాన్ని కలిగిస్తాయి’ అని తెలుపుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News November 12, 2025
విచారణకు పూర్తి స్థాయిలో సహకరించా: ధర్మారెడ్డి

AP: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని సీబీఐ సిట్ రెండో రోజు 8 గంటలపాటు విచారించింది. విచారణకు తాను పూర్తిస్థాయిలో సహకరించినట్లు ధర్మారెడ్డి మీడియాకు తెలిపారు. ‘అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సవివరంగా సమాధానం చెప్పా. గతంలో టీటీడీలో బాధ్యతలు నిర్వర్తించిన అధికారులందరినీ ప్రశ్నిస్తున్నారు. అందులో భాగంగానే నన్నూ విచారించారు’ అని మీడియాకు తెలిపారు.
News November 12, 2025
TG, AP న్యూస్ రౌండప్

✦ DEC 20 నాటికి మేడారం అభివృద్ధి పనులు పూర్తి: మంత్రి పొంగులేటి
✦ రాష్ట్రంలో 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు.. నిబంధనలు ఉల్లంఘించే వెహికల్స్కు భారీ ఫైన్: మంత్రి పొన్నం
✦ DEC 3 నుంచి అందుబాటులోకి TG SET హాల్ టికెట్లు
✦ విజయవాడలో 249kgs గంజాయి పట్టుకున్న ఈగల్ టీమ్
✦ ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో నలుగురు నిందితులకు ఈ నెల 25 వరకు రిమాండ్ విధించిన విజయవాడ కోర్టు


