News October 5, 2024

‘రాజా సాబ్‌’ టీమ్‌కు ప్రభాస్ సూచన?

image

మారుతి డైరెక్షన్‌లో ‘రాజా సాబ్’లో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది కాకుండా ఆయన లైనప్‌లో సలార్-2, స్పిరిట్, హను-ప్రభాస్, కన్నప్ప సినిమాలున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెలాఖరులోపే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేయాలని మూవీ టీమ్‌కు ఆయన చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే మెజారిటీ షూట్ పూర్తయిన నేపథ్యంలో త్వరగానే మిగతా షూట్ కూడా కంప్లీట్ కావొచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి..

Similar News

News July 5, 2025

కొత్తగా 157 సర్కారీ బడులు

image

TG: రాష్ట్రంలో కొత్తగా 157 ప్రభుత్వ స్కూళ్లు ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం 20 మంది విద్యార్థులకు మించి ఉన్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొత్తం 571 బడులు నెలకొల్పాలని సర్కార్ నిర్ణయించింది. ఈక్రమంలోనే గ్రామాల్లో 63, పట్టణాల్లో 94 స్కూళ్లు వెంటనే తెరవాలని DEOలను ఆదేశించింది. ఫర్నీచర్, విద్యాసామగ్రి, ఇతర ఖర్చులకు బడ్జెట్‌ను కలెక్టర్ల ద్వారా సమకూర్చనుంది.

News July 5, 2025

త్వరలో ‘ఎన్టీఆర్ బేబీ కిట్లు’

image

AP: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన వారికి ప్రభుత్వం త్వరలో NTR బేబీ కిట్లు అందించనుంది. 2016లోనే ఈ పథకం ప్రవేశపెట్టగా మధ్యలో నిలిచిపోయింది. మళ్లీ ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ ఆస్పత్రులకు కాంట్రాక్ట్ పద్ధతిలో కిట్లు సరఫరా చేసేందుకు టెండర్లు పిలిచింది. కిట్‌లో దోమ తెరతో కూడిన పరుపు, దుస్తులు, నాప్కిన్లు, సబ్బు, పౌడర్, ఆయిల్ వంటి 11 రకాల వస్తువులు ఉంటాయి.

News July 5, 2025

పాప్ సింగర్స్‌ను వెనక్కినెట్టిన అర్జీత్

image

బాలీవుడ్ స్టార్ సింగర్ అర్జీత్ సింగ్ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ స్పాటిఫైలో 151 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో టేలర్ స్విఫ్ట్(139.6M), ఎడ్ షీరన్(121M) వంటి ఇంటర్నేషనల్ స్టార్స్‌ను వెనక్కినెట్టారు. అత్యధిక ఫాలోవర్లు కలిగిన సింగర్‌గా నిలిచారు. అర్జీత్ తర్వాత ఇండియన్స్‌లో ఏఆర్ రెహమాన్(65.6M) 14వ స్థానం, ప్రీతమ్(53.4M) 21, నేహా కక్కర్(48.5M) 25వ ప్లేస్‌లో ఉన్నారు.