News September 7, 2024

‘సింగం అగైన్’లో ప్రభాస్, సూర్య క్యామియో రోల్స్?

image

రోహిత్ శెట్టి డైరెక్షన్‌లో అజయ్ దేవగణ్ హీరోగా ‘సింగం అగైన్’ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. ఈ చిత్రంలో ఒరిజినల్ సింగం సూర్య, ప్రభాస్ క్యామియో రోల్స్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై మేకర్స్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. గతంలో ప్రభాస్ యాక్షన్ జాక్సన్ సినిమాలో, సూర్య సర్ఫిరా మూవీలో గెస్ట్ రోల్స్‌ చేశారు.

Similar News

News October 18, 2025

5 జిల్లాల్లో ₹7910 కోట్లతో చురుగ్గా జలజీవన్ పనులు

image

AP: 5 జిల్లాల్లో ₹7910 కోట్లతో జలజీవన్ పథకం పనుల్ని ప్రభుత్వం చురుగ్గా సాగిస్తోంది. ఈ పథకం నిధులు మురిగిపోయే పరిస్థితి రాగా మరో 4 ఏళ్లు పొడిగించేలా కూటమి సర్కారు కేంద్రాన్ని ఒప్పించి మళ్లీ పనులకు శ్రీకారం చుట్టించింది. ఇవి పూర్తయితే 1.22 కోట్ల మందికి రక్షిత నీరందుతుంది. ఫ్లోరైడ్ సమస్య ఉన్న పశ్చిమ ప్రకాశంలో ₹1290కోట్లతో పనులు చేస్తున్నారు. చిత్తూరు, గుంటూరు, గోదావరి జిల్లాల్లో కొన్ని పూర్తయ్యాయి.

News October 18, 2025

న్యాయవ్యవస్థలు దిగొస్తాయని నమ్ముతున్నాం: ఆర్.కృష్ణయ్య

image

TG: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం నిర్వహించిన బంద్ విజయవంతమైందని బీసీ జేఏసీ ఛైర్మన్, ఎంపీ ఆర్.కృష్ణయ్య చెప్పారు. బీసీల డిమాండ్ న్యాయమని భావించి మద్దతిచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. రిజర్వేషన్ల విషయంలో న్యాయవ్యవస్థలు దిగివస్తాయని నమ్ముతున్నామని పేర్కొన్నారు. బీసీ కులాల గౌరవం, పేదరిక నిర్మూలన కోసం తాము పోరాటం చేస్తున్నామని అన్నారు.

News October 18, 2025

150 లిక్కర్ షాపులకు ఏపీ మహిళ దరఖాస్తు

image

TG: మద్యం షాపుల దరఖాస్తులు నేటితో ముగిశాయి. మొత్తం 90వేలకు పైగా అప్లికేషన్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఏపీలోని ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఓ మహిళ 150 మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసింది. ఆమె ఏపీకి సరిహద్దు జిల్లాల్లోని షాపులకు ఎక్కువగా దరఖాస్తులు చేసిందని అధికారులు చెబుతున్నారు. యూపీ, కర్ణాటక, ఒడిశా నుంచి కూడా చాలా మంది మహిళలు అప్లై చేసుకున్నారు. ఈనెల 23న లైసెన్స్‌ల కోసం డ్రా నిర్వహించనున్నారు.