News March 27, 2024
ప్రభాస్ ‘కల్కి’ డిజిటల్ రైట్స్ రూ.300 కోట్లకు పైనే?

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ‘కల్కి’ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. సౌత్ ఇండియన్ వెర్షన్‌ల డిజిటల్ హక్కులను రూ.150 కోట్లకు ప్రముఖ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీంతోపాటు హిందీ వెర్షన్ డిజిటల్ హక్కులు రూ.175 కోట్లకు అమ్ముడయ్యాయట. ఈ సినిమా కోసం వివిధ ప్లాట్‌ఫామ్స్ పోటీ పడగా చివరికి నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుందట.
Similar News
News March 31, 2026
బాలామృతమా… బాలల పాలిట విషమా!

TG: అంగన్వాడీ సెంటర్లలో అందిస్తున్న పాలపొడి, ఇతర పదార్థాలు విషతుల్యంగా మారుతున్నాయి. కాలంచెల్లిన సరకుకు కొత్త లేబుల్స్ అంటించి కాంట్రాక్టర్లు అందిస్తున్నారు. వీటిలో ఫంగస్, బాక్టీరియా ఉన్నట్లు స్టేట్ ఫుడ్ ల్యాబ్ రిపోర్ట్ తేల్చింది. కమీషన్ల మత్తులో అధికారులు చర్యలకు బదులు హెచ్చరికలతో సరిపెడుతున్నారు. 35700కు పైగా అంగన్వాడీ కేంద్రాలుండగా వీటిలో పోషకాహారానికి FY25-26లో GOVT ₹156 CR ఇచ్చింది.
News March 31, 2026
కోకాకోలా బాటిళ్లకు ఎల్లో క్యాప్స్.. ఎందుకంటే?

కోకాకోలా బాటిళ్లకు ఎరుపు/ బ్లూ రంగు క్యాప్స్ ఉండటం కామన్. అయితే యూదుల ‘పాసోవర్’ పండుగ(Apr 1-9) సందర్భంగా పసుపు రంగు క్యాప్స్‌తో స్పెషల్ ఎడిషన్‌ను కోకాకోలా విడుదల చేసింది. సాధారణ కోకాకోలాలో మొక్కజొన్న సిరప్ వాడుతారు. కానీ ఈ పండుగ సమయంలో యూదులు మొక్కజొన్న ఉత్పత్తులకు దూరంగా ఉంటారు. దీంతో చక్కెరతో చేసిన ‘కోషర్’ వెర్షన్‌ను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. వీటికి పసుపు రంగు క్యాప్‌లను ఉపయోగించింది.
News March 31, 2026
వైభవ్‌ను భారత జట్టులోకి తీసుకోండి: మైఖేల్ వాన్

15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ IPLలో 17 బాల్స్‌లోనే 52 రన్స్ బాదిన వైభవ్ బ్యాటింగ్‌లో ఉన్న ‘ఫియర్ లెస్’ యాటిట్యూడ్‌ను చూసి ఆయన ముచ్చటపడ్డారు. వెంటనే ఈ కుర్రాడిని ఇంగ్లండ్ టూర్ కోసం ఎంపిక చేయాలని BCCIకి సూచించారు. ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కకపోయినా సీనియర్లతో కలిసి ఉంటే అతడికి మంచి ఎక్స్‌పీరియన్స్ వస్తుందని అభిప్రాయపడ్డారు.


