News October 20, 2024
CSKలో సాధన టెస్టుల్లో ఉపయోగపడింది: రచిన్

బెంగళూరు మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఉన్న సమయంలో చేసిన సాధన, భారత పరిస్థితులకు అలవాటు పడేందుకు ఉపకరించిందని ఆయన మ్యాచ్ అనంతరం తెలిపారు. ‘CSKలో ఉన్నప్పుడు వివిధ రకాల పిచ్‌లపై సాధన చేసేవాడిని. విభిన్నమైన నెట్ బౌలర్లు అందుబాటులో ఉండేవారు. ఆ సాధన నాకు ఉప ఖండపు పిచ్‌లపై ఎలా ఆడాలో నేర్పించింది’ అని వివరించారు.
Similar News
News November 6, 2025
ఎస్‌బీఐ PO ఫలితాలు విడుదల

SBIలో 541 ప్రొబెషనరీ ఆఫీసర్(PO) ఉద్యోగాలకు నిర్వహించిన మెయిన్స్ పరీక్ష ఫలితాలు రిలీజయ్యాయి. ఎంపికైన అభ్యర్థుల జాబితాను <
News November 6, 2025
విద్యార్థుల లక్ష్యాలను నెరవేర్చడానికి బాటలు వేస్తాం: రామ్మోహన్

AP: ప్రపంచంలో రోజూ కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. ప్రతి రంగంలోనూ టెక్నాలజీ వినియోగం పెరుగుతోందని, దీన్ని విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సూచించారు. <<18216721>>సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్<<>> కోసం ఢిల్లీలో పర్యటిస్తోన్న స్టూడెంట్లతో ఆయన ముచ్చటించారు. విద్యార్థుల లక్ష్యాలను నెరవేర్చడానికి బాటలు వేస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో సక్సెస్ కావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
News November 6, 2025
మినుము పంటలో విత్తన శుద్ధితో అధిక దిగుబడి

మినుము పంటలో తెగుళ్ల కట్టడికి విత్తనశుద్ధి కీలకం. దీని కోసం కిలో విత్తనానికి 2.5 గ్రాముల కాప్టాన్ (లేదా) థైరాన్ (లేదా) మాంకోజెబ్‌లతో విత్తనశుద్ధి చేయాలి. తర్వాత కిలో విత్తనానికి 5ml ఇమిడాక్లోప్రిడ్ 600 FS మందును కలిపి నీడలో ఆరనివ్వాలి. విత్తడానికి గంట ముందుగా కిలో విత్తనానికి 20గ్రా రైజోబియం కల్చరును కలిపినట్లైతే, నత్రజని బాగా అందుబాటులో ఉండటం వల్ల, అధిక పంట దిగుబడిని పొందవచ్చు.


