News August 17, 2024
కరాటే, హార్స్ రైడింగ్ ప్రాక్టీస్ చేస్తా: మనూ భాకర్

కొద్ది రోజులు గన్ శబ్దాలకు దూరంగా ఉండాలని ఒలింపిక్ డబుల్ మెడలిస్ట్ మనూ భాకర్ భావిస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. ‘షూటింగ్ నుంచి 3 నెలల విరామం తీసుకుంటున్నా. కరాటే, గుర్రపుస్వారీ, స్కేటింగ్, భరతనాట్యం నేర్చుకుంటా. స్కైడైవింగ్, స్కూబాడైవింగ్ కూడా చేయాలనుంది’ అని ఆమె పేర్కొన్నారు. కాగా గుర్రపుస్వారీ చేయొద్దని కోచ్ జస్పాల్ రాణా సూచించగా తనకు స్వారీ బాగా వచ్చన్నారు.
Similar News
News January 12, 2026
రబీ సీజన్‌కు సరిపడా యూరియా ఉంది: వ్యవసాయాధికారి

రబీ 2025–26 సీజన్‌కు సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ కుమారి తెలిపారు. జిల్లాకు అవసరమైన 38,353 మెట్రిక్ టన్నుల యూరియాకు ప్రణాళిక రూపొందించగా, ఇప్పటివరకు 25,504 మెట్రిక్ టన్నులు రైతులకు సరఫరా చేసామని. అక్టోబర్ 1, 2025 నుంచి జనవరి 11, 2026 వరకు 21,734 మెట్రిక్ టన్నుల విక్రయాలు జరిగినట్లు తెలిపారు. యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News January 12, 2026
కోల్డ్ వేవ్స్.. వీళ్లకు ముప్పు ఎక్కువ!

మరికొన్నిరోజులు చలిగాలుల తీవ్రత కొనసాగుతుందని IMD హెచ్చరించింది. దీంతో గుండె, లంగ్స్, కిడ్నీ వ్యాధిగ్రస్థులు జాగ్రత్తగా ఉండాలని ఎయిమ్స్ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ‘చలికాలంలో రక్తనాళాలు కుంచించుకుపోతాయి. నీరు తీసుకోవడం తగ్గుతుంది. ఉప్పు వాడకం పెరుగుతుంది. ఇవి BP, హార్ట్ అటాక్ ప్రమాదాన్ని పెంచుతాయి’ అని కార్డియాలజీ ప్రొఫెసర్ రాజీవ్ నారంగ్ తెలిపారు. ఉదయం వాకింగ్‌కు వెళ్లకపోవడమే మంచిదని సూచించారు.
News January 12, 2026
మద్యం బాటిల్‌పై రూ.10 పెంపు

AP: మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.99 MRP ఉన్న మద్యం బాటిళ్లు, బీర్లు, వైన్ బాటిళ్లు మినహా మిగతావాటికి రూ.10 చొప్పున పెంచింది. దీంతో ఏటా రూ.1,391 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. బార్లు, మద్యం షాపుల్లో వేర్వేరు ధరలు ఉండటంతో అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్నును ఉపసంహరించాలని నిర్ణయించింది. దీంతో బార్లు, మద్యం షాపుల్లో ధరలు ఒకేలా ఉండే అవకాశం ఉంది.


