News June 23, 2024
NTA కొత్త చీఫ్‌గా ప్రదీప్ సింగ్ ఖరోలా

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) డైరెక్టర్ జనరల్‌గా ప్రదీప్ సింగ్ ఖరోలాను కేంద్రం నియమించింది. ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఛైర్మన్, ఎండీగా ఉన్న ఖరోలాకు ఎన్టీఏ డీజీగా అదనపు బాధ్యతలను అప్పగించింది. కాగా నీట్, నెట్ పరీక్షా పేపర్ల లీకేజీ వ్యవహారం దుమారం రేపడంతో ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్‌పై కేంద్రం వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదాల నేపథ్యంలో నేడు జరగాల్సిన నీట్-PG పరీక్షను సైతం రద్దు చేశారు.
Similar News
News December 25, 2025
‘శంబాల’ మూవీ రివ్యూ&రేటింగ్

ఆకాశం నుంచి ‘శంబాల’ గ్రామంలో ఉల్క పడిన తర్వాత ఏం జరిగిందనేదే కథ. సైన్స్, మూఢనమ్మకాలను లింక్ చేస్తూ థ్రిల్లింగ్ అంశాలతో డైరెక్టర్ యుగంధర్ కథను నడిపించారు. హీరో ఆది సాయికుమార్ నటనతో మెప్పించారు. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. శ్రీచరణ్ మ్యూజిక్ మూవీకి ప్లస్. VFXలో క్వాలిటీ లోపించింది. ఫస్టాఫ్ మరింత ఎడిట్ చేయాల్సింది. ఊహకందే కథనం, రొటీన్ క్లైమాక్స్ మైనస్.
రేటింగ్: 2.75/5
News December 25, 2025
3,073పోస్టులు.. ఆన్సర్ కీ విడుదల

<
News December 25, 2025
NCERT ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

NCERT 173 గ్రూప్ A, B, C పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు DEC 27 – జనవరి 16 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్ , ITI, డిప్లొమా, డిగ్రీ, PG, B.Tech, M.Tech, MBA, M.Lib.Sc, B.Lib.Sc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.ncert.nic.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.


