News March 17, 2024
పార్లమెంట్ ఎన్నికలు ముగిసే వరకు ప్రజావాణి రద్దు: కలెక్టర్ హరిచందన

పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినందున ఈనెల18న నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరి చందన ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసే వరకు జూన్ 6 వరకు ప్రజావాణి కార్యక్రమం ఉండదని ఆమె పేర్కొన్నారు.
Similar News
News November 8, 2025
NLG: ఉత్కంఠ భరితంగా క్రీడా పోటీలు

నాగార్జునసాగర్లో మహాత్మాజ్యోతిబా ఫులే గురుకుల విద్యార్థుల జిల్లా స్థాయి క్రీడా పోటీలు కొనసాగుతున్నాయి. రెండో రోజు కబడ్డీ, వాలీబాల్, ఖోఖోతో పాటు అథ్లెటిక్స్ విభాగంలో పరుగు పందెం, జంపింగ్ తదితర విభాగాల పోటీలు ఉత్కంఠ భరితంగా జరిగాయి. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీల్లో ఫైనల్కు చేరుకోగా, అథ్లెటిక్స్ విభాగంలో 200 మీటర్ల పరుగుపందెంలో నాగార్జునసాగర్ పాఠశాల ప్రథమ బహుమతి సాధించింది.
News November 8, 2025
NLG: చెరువుకు చేరుతున్న చేప.. 6 కోట్ల చేప పిల్లల పంపిణీ

ఎట్టకేలకు చెరువుల్లోకి చేప పిల్లలు చేరుతున్నాయి. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న వంద శాతం రాయితీపై ఉచిత చేప పిల్లలను మత్స్యశాఖ అధికారులు పంపిణీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1200 చెరువులు, ప్రాజెక్టులు, కుంటల్లో ఆరు కోట్ల చేప పిల్లలు విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు 60 లక్షల చేప పిల్లలను పంపిణీ చేసినట్లు మత్స్యశాఖ అధికారులు తెలిపారు.
News November 8, 2025
NLG: ఈ ఇసుక ఎక్కడి నుంచి వస్తుందో?!

నల్గొండ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. రాజకీయ అండదండలు కొంతమంది దళారులు దీనినే ప్రధాన వృత్తిగా పెట్టుకుని దందా సాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు అప్పుడప్పుడు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నా ఏమాత్రం బెదరని మాఫియా యథేచ్ఛగా స్థానిక వాగుల నుంచి ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో రోజు వందల ట్రాక్టర్లలో ఇసుక విక్రయిస్తున్నారు.


