News December 11, 2024

‘ప్రజావాణి’ కొనసాగుతుంది: భట్టి విక్రమార్క

image

TG: ఎన్ని ఇబ్బందులొచ్చినా ‘ప్రజావాణి’ కొనసాగుతుందని dy.CM భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సమస్యలతో వస్తున్న వారందరికీ పరిష్కారం చూపుతున్నామన్నారు. దరఖాస్తులన్నీ పరిశీలిస్తున్నామని, ప్రతి ఒక్కరి బాధను వింటూ పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ప్రజల అవసరాలు తీర్చి, వారికి జవాబుదారీతనంగా ఉండటమే తమ లక్ష్యమని వివరించారు. ‘మీ కోసం మేము ఉన్నాం’ అనే భావనను అధికారులు ప్రజలకు కల్పించాలని ఆదేశించారు.

Similar News

News November 29, 2025

TODAY HEADLINES

image

➢ గోవాలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన(77 ఫీట్) రాముని విగ్రహాన్ని ఆవిష్కరించిన పీఎం మోదీ
➢ జనవరి 1న అందరం లొంగిపోతాం: మావోయిస్టు పార్టీ
➢ 2028 మార్చికి అమరావతి నిర్మాణం పూర్తి: CM CBN
➢ అమరావతిలో 15 బ్యాంకులకు ఒకేసారి శంకుస్థాపన
➢ దూసుకొస్తున్న ‘దిత్వా’ తుఫాన్.. కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన
➢ TGలో పంచాయతీ ఎన్నికలపై స్టేకు హైకోర్టు నిరాకరణ
➢ కాళేశ్వరంతో ఒక్క ఎకరానికీ నీళ్లు రాలేదు: కవిత

News November 29, 2025

మావోయిస్ట్ కీలక నేత అనంత్ అస్త్ర సన్యాసం

image

మావోయిస్టు పార్టీ కీలక నేతల లొంగుబాటు పర్వం కొనసాగుతోంది. తాజాగా మహారాష్ట్ర – మధ్యప్రదేశ్ – ఛత్తీస్‌గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ మహారాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు. మొత్తం 15 మంది నక్సల్స్ అస్త్ర సన్యాసం తీసుకున్నారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. జనవరి 1న సాయుధ విరమణ చేస్తున్నట్టు నిన్న లేఖ విడుదల చేసిన అనంత్ అంతలోనే లొంగిపోవడం గమనార్హం.

News November 29, 2025

‘ఒక్క రూపాయి లేదు.. కొంచెం క్యాష్ పెట్టండి’

image

తిరునెల్వేలి (TN)లో ఓ దొంగ రాసిన లేఖ SMలో వైరల్ అవుతోంది. జేమ్స్ పాల్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి మదురైకి వెళ్లారు. అనంతరం ఫోన్‌లో చెక్ చేయగా ఇంటి CCTV పనిచేయకపోవడంతో అనుమానం వచ్చి పొరుగువారికి కాల్ చేశారు. వారు వెళ్లి చూసేసరికి తలుపు పగిలి ఉన్నట్లు గుర్తించారు. పోలీసుల పరిశీలనలో ఓ లేఖ దొరికింది. “ఇంట్లో ఒక్క రూపాయి లేదు. ఎందుకు ఇన్ని కెమెరాలు. కొంచెం అయినా క్యాష్ పెట్టండి” అంటూ రాసుకొచ్చాడు.