News September 8, 2025
జైల్లో లైబ్రరీ క్లర్క్‌గా ప్రజ్వల్ రేవణ్ణ

పనిమనిషిపై అత్యాచారం కేసులో హాసన్ (కర్ణాటక) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు యావజ్జీవ శిక్ష పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరప్పన ఆగ్రహార జైలులో ఉన్న ఆయనకు అధికారులు లైబ్రరీ క్లర్క్ పనిని కేటాయించారు. ఖైదీలకు పుస్తకాలు ఇవ్వడం, వాటి వివరాలు నమోదు చేయడమే పని. రోజుకు ₹522 జీతంగా ఇస్తారు. జీవిత ఖైదు అనుభవిస్తున్న వారు నెలకు కనీసం 12, వారానికి 3 రోజులు పని చేయాలనే నిబంధన ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Similar News
News February 1, 2026
బడ్జెట్ బూస్ట్.. ఎగసిన స్టాక్ మార్కెట్లు

ఉదయం ఫ్లాట్‌గా మొదలైన స్టాక్ మార్కెట్లు కొద్దిసేపటికే లాభాల్లోకి వచ్చాయి. కేంద్ర మంత్రి నిర్మల బడ్జెట్ ప్రసంగం మొదలైన తర్వాత మెల్లగా పైకెగిశాయి. ప్రస్తుతం నిఫ్టీ 60 పాయింట్లు, సెన్సెక్స్ 250 పాయింట్లు లాభపడ్డాయి. నిఫ్టీ 25,370, సెన్సెక్స్ 82,521 వద్ద కొనసాగుతున్నాయి.
News February 1, 2026
Budget 2026-27: అరకులో మౌంటేన్ ట్రైన్స్

*ఏపీలోని అరకులో పర్యాటక రంగ అభివృద్ధి కోసం మౌంటేన్ ట్రైన్స్ ఏర్పాటు
*దేశంలో కొత్తగా 3 ఆయుర్వేద ఎయిమ్స్‌లు, 5 రీజినల్ మెడికల్ హబ్‌లు
*ఆయుష్ కేంద్రాలు, ల్యాబ్స్ అప్‌గ్రేడేషన్
*రూ.10వేల కోట్లతో MSMEల అభివృద్ధి
*కంటైనర్ తయారీ రంగం కోసం రూ.10వేల కోట్లు
*క్రీడల అభివృద్ధి కోసం ఖేలో ఇండియా మిషన్
News February 1, 2026
ఆ మూడు కర్తవ్యాలతోనే బడ్జెట్ రూపొందించాం: ఆర్థికమంత్రి

ఈసారి కేంద్ర బడ్జెట్‌ను మూడు కర్తవ్యాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించినట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. గ్రోత్ పెంచడం, సమ్మిళిత అభివృద్ధి, తగిన సంస్కరణలతో ఆ వృద్ధిని కొనసాగించడం అనేవి మూడు కర్తవ్యాలని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యమని, దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించేందుకు ఇవి సహాయపడతాయని తెలిపారు.


