News June 4, 2024

ఓటమి దిశగా ప్రజ్వల్

image

లైంగిక వేధింపుల కేసు నిందితుడు జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఓటమి దిశగా సాగుతున్నారు. కర్ణాటకలోని హసన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయనపై ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి శ్రేయస్ పటేల్ 43వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత ఆయన లీడింగ్‌లో కొనసాగగా ఇప్పుడు రెండోస్థానానికి పడిపోయారు.

Similar News

News November 27, 2025

మిరపలో బూడిద తెగులు – నివారణ

image

మిరపను నవంబర్ నుంచి జనవరి వరకు బూడిద తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. తెల్లని పొడి పూత ఎక్కువగా ఆకుల దిగువ భాగంలో కనిపిస్తుంది. ఆకుల పై భాగంలో పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. ఆకులు ఎండి రాలిపోతాయి. తెగులు సోకిన ఆకుభాగం గోధుమ రంగులోకి మారుతుంది. ఈ తెగులు నివారణకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో అజోక్సిస్ట్రోబిన్ 23% SC 200ml లేదా టెబుకొనజోల్25% WG 300 గ్రా. లేదా సల్ఫర్ 80% WP 800 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.

News November 27, 2025

ఏకగ్రీవం.. ఒకే కుటుంబం నుంచి సర్పంచ్, వార్డు సభ్యులు

image

TG: పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో గ్రామాల్లో సందడి మొదలైంది. వికారాబాద్ జిల్లా మంతన్ గౌడ్ గ్రామంలో ఒకే ఎస్టీ కుటుంబం ఉంది. అక్కడ ఎస్టీ రిజర్వేషన్ ఉండటంతో అదే కుటుంబానికి చెందిన వ్యక్తులు సర్పంచ్, వార్డు సభ్యులుగా ఏకగ్రీవంగా ఎంపిక కానున్నారు. అలాగే ఆదిలాబాద్(D) తేజాపూర్‌లో కోవ రాజేశ్వర్, సిరిసిల్ల(D) రూప్లానాయక్ తండాలో రూప్లానాయక్‌ను గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

News November 27, 2025

వాటర్ హీటర్ వాడుతున్నారా?

image

చాలా మంది నీటిని వేడి చేసేందుకు వాటర్‌ హీటర్లు ఉపయోగిస్తుంటారు. అయితే వీటి వాడకంలో కొన్ని జాగ్రత్తలు అవసరమంటున్నారు నిపుణులు. చిన్న పిల్లలు ఆడుకునే చోట.. హీటర్​తో నీళ్లను వేడిచేయకూడదు. బాత్‌రూమ్‌లో పెడితే అక్కడ తడిగా ఉంటుంది కాబట్టి, షాక్ కొట్టే ప్రమాదం ఉంది. ఇమ్మర్షన్ రాడ్‌ పూర్తిగా నీటిలో మునిగిన తరవాతనే.. స్విఛ్‌ ఆన్ చెయ్యాలి. మెటల్ బకెట్‌లో పెట్టవద్దు. తడి చేతులతో, తడి బట్టలతో ముట్టుకోకూడదు.