News May 24, 2024
దేవెగౌడ సహకారంతోనే ప్రజ్వల్ జర్మనీ వెళ్లాడు: సీఎం

లైంగిక వేధింపుల కేసు నిందితుడు, తన మనుమడు ప్రజ్వల్ రేవణ్ణ దేశానికి తిరిగి రావాలంటూ మాజీ PM దేవెగౌడ చేసిన ప్రకటనపై కర్ణాటక CM సిద్ధరామయ్య సెటైర్లు వేశారు. ఆయన సహకారంతోనే ప్రజ్వల్ జర్మనీ వెళ్లారని, కేవలం ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించుకునేందుకే ప్రకటన చేశారని విమర్శించారు. కాగా గతనెల 26న అర్ధరాత్రి ప్రజ్వల్ బెంగళూరు నుంచి జర్మనీకి వెళ్లి, అక్కడి నుంచి లండన్ వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Similar News
News November 21, 2025
యాదగిరిగుట్ట దేవస్థానంలో ఉద్యోగాల నోటిఫికేషన్

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఖాళీగా ఉన్న మతపర సేవా పోస్టుల భర్తీకి దేవాదాయశాఖ ఆదేశాలతో ఆలయ అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. వేదపండితులు, పరిచారికులు, వాహన పురోహితులు తదితర ఉద్యోగాలకు 59 పోస్టులకు 18-46 ఏళ్లలోపు హిందువులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అర్హత పత్రాలతో DEC12 సా.5 లోపు దేవస్థానం వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News November 21, 2025
పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఎలా ఇస్తారు: R.కృష్ణయ్య

రిజర్వేషన్ల పేరిట BCలను TG ప్రభుత్వం మోసం చేస్తోందని BC నేత, MP R.కృష్ణయ్య మండిపడ్డారు. ‘పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులుండవు. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఎలా ఇస్తారు? కోర్టు తీర్పు వచ్చే వరకూ ఎలక్షన్స్ వాయిదా వేయాలి. ఓటు చోరీపై పార్లమెంటులో ఆందోళనలు చేసిన ఇండీ కూటమి MPలు.. BC రిజర్వేషన్లపై ఎందుకు నిరసన చేపట్టలేదు? వారు ఆందోళనలు చేస్తే PM స్పందించి BCలకు మేలు చేసేవారు’ అని వ్యాఖ్యానించారు.
News November 21, 2025
7 సినిమాలు.. అనుపమ అరుదైన ఘనత

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అరుదైన ఘనత సాధించారు. ఈ ఏడాది ఆమె 3 భాషల్లో నటించిన 6 చిత్రాలు విడుదలవగా DEC 5న ‘లాక్‌డౌన్’ ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ తరం కథానాయికల్లో ఈ ఫీట్ సాధించిన తొలి దక్షిణాది నటిగా నిలిచారు. అనుపమ నటించిన డ్రాగన్, బైసన్, కిష్కింధపురి మంచి విజయాలు సాధించగా, పరదా, జానకిvsస్టేట్ ఆఫ్ కేరళ, పెట్ డిటెక్టివ్ ఫర్వాలేదనిపించాయి. ఆమె తెలుగులో శర్వానంద్ సరసన భోగి మూవీలోనూ నటిస్తున్నారు.


