News March 17, 2024

ప్రకాశం: హాల్ టికెట్ ఉంటే బస్సు ప్రయాణం ఫ్రీ

image

ఈనెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులు ఆర్టీసీ బస్సులలో టెన్త్ క్లాస్ హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణం చేయవచ్చని కనిగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీమన్నారాయణ ఆదివారం తెలిపారు. నియోజకవర్గంలోనీ మీ ప్రాంతం నుంచి పరీక్షా కేంద్రాల వరకు అన్ని పల్లె వెలుగు, అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్నారు.

Similar News

News January 23, 2026

కందుకూరు LICలో రూ.3 కోట్ల స్కాం.!

image

కందుకూరు LICలో భారీ స్కాం బయటపడింది. పూర్వాశ్రమంలో ఏజెంట్‌గా ఉండి తర్వాత డెవలప్మెంట్ ఆఫీసర్‌గా మారిన పూజల శ్రీనివాస్ పథకం ప్రకారం స్కాంకు పాల్పడ్డాడు. దొంగ పాలసీలు చేయించి నకిలీ డెత్ సర్టిఫికెట్లతో రూ.3 కోట్లు కాజేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కొత్త సాప్ట్‌వేర్‌తో ఈ స్కాం గుట్టు రట్టయినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News January 23, 2026

ప్రకాశం: రూ.144 చెల్లిస్తే కొండంత భరోసా..!

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పాడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రాయితీతో కూడిన బీమాను ఈనెల 19నుంచి అమల్లోకి తెచ్చింది. కేవలం 15% చెల్లింపుతో ఆవు, గేదె, గొర్రె, మేకలు చనిపోతే పాడిరైతు ఖాతాలో నగదు జమవుతోంది. ఈనెల 31వరకు జరుగే పశుఆరోగ్య శిబిరాల్లో నమోదు చేసుకోవాలి. మేలుజాతి ఆవులు, గేదెలు ఒక్కోదానికి మూడేళ్లకు రూ.288, నాటుజాతి పశువులకు మూడేళ్లకు రూ.144, గొర్రెలు, మేకలకు మూడేళ్ల కాలానికి రూ.56 చెల్లించాలి.

News January 23, 2026

ఒంగోలు మీదుగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్..!

image

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొత్తగా తాంబరం–సంత్రాగాచి–తాంబరం అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ (16107/16108) వారానికి ఒకసారి నడవనుంది. జనవరి 23 నుంచి తాంబరం నుంచి, జనవరి 24 నుంచి సంత్రాగాచి నుంచి సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ రైలు ఒంగోలు మీదుగా ప్రయాణించనుంది. ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందించనుందని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి.