News March 17, 2024

ప్రకాశం: పోటీకి సిద్ధం.. గెలుపెవరది?

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అభ్యర్థుల ఖరారుతో ఎన్నికల సమరానికి పార్టీలు సిద్ధమయ్యాయి. టీడీపీ 10 స్థానాలను ఇప్పటికే ప్రకటించగా, వైసీపీ శనివారం అభ్యర్థులను ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా పూర్తి స్పష్టత వచ్చింది. ఇక ఎన్నికల ప్రచారమే తరువాయి. చీరాల, దర్శి స్థానాలను టీడీపీ ఇంకా ప్రకటించనప్పటికీ అక్కడ పొత్తులోభాగంగా ఎవరికి సీట్లు వస్తాయో చూడాలి. ఏది ఏమైనా జిల్లాలో పూర్తి స్పష్టతతో పార్టీలు దూసుకుపోతున్నాయి.

Similar News

News December 6, 2025

ప్రకాశంలో స్క్రబ్ టైఫస్‌తో మహిళ మృతి.. కానీ!

image

ప్రకాశంలో స్క్రబ్ టైఫస్ వ్యాధి పాజిటివ్ వచ్చిన మహిళ మృతి చెందినట్లు డీఎంహెచ్వో వెంకటేశ్వర్లు తెలిపారు. ఎర్రగొండపాలెం మండలానికి చెందిన వృద్ధురాలు గత నెల 11న అనారోగ్యానికి గురై మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లారన్నారు. 29న అక్కడ నిర్వహించిన టెస్టుల్లో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ వచ్చిందన్నారు. ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా మృతికి కారణంగా డీఎంహెచ్వో తెలిపారు.

News December 6, 2025

మోసపోవద్దు తస్మాత్ జాగ్రత్త: ప్రకాశం పోలీస్

image

వాట్సాప్‌లకు వచ్చే ఏపీకే ఫైల్స్ క్లిక్ చేసి మోసపోవద్దని ప్రకాశం పోలీసులు తాజాగా హెచ్చరించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు సైబర్ నేరాలపై పోలీసులు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ఏపీకే ఫైల్స్ జోలికి వెళ్లవద్దని పోలీసులు సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటన చేశారు. బ్యాంక్, అధికారుల పేర్లతో వచ్చే ఏపీకే ఫైల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాటిని క్లిక్ చేయవద్దని సూచించారు.

News December 5, 2025

ప్రకాశం: నెలకు రూ.2 లక్షల శాలరీ.. డోంట్ మిస్.!

image

అబుదాబి, దుబాయ్ ప్రాంతాల్లో హోమ్ కేర్, నర్స్ ఉద్యోగావకాశాలు ఉన్నాయని, జిల్లాలోని అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్కిల్ డెవలప్మెంట్ జిల్లా అధికారి రవితేజ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. 21 నుంచి 40 సంవత్సరాలు గల మహిళలు అర్హులని, నెలకు రూ.2లక్షల వరకు వేతనం ఉంటుందన్నారు. ఈనెల 7వ తేదీలోగా ప్రకాశం జిల్లా నైపుణ్యం వెబ్సైట్‌‌లో పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.