News March 17, 2024
ప్రకాశం: గ్రూప్-1 పరీక్షకు పటిష్ట బందోబస్తు

రేపు నిర్వహించనున్న గ్రూప్ -1 స్క్రీనింగ్ టెస్ట్‌కు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి తెలిపారు. ప్రిలిమినరీ పరీక్ష నేపథ్యంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 9 కేంద్రాల్లో మొత్తం 6,116 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. పరీక్ష రోజున జిల్లా వ్యాప్తంగా సెక్షన్-30 పోలీస్ యాక్టు అమలులో ఉంటుందన్నారు.
Similar News
News January 19, 2026
ఒంగోలులో యోగి వేమన జయంతి వేడుకలు

ఒంగోలు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో విశ్వకవి యోగివేమన జయంతిని పురస్కరించుకుని సోమవారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగివేమన చిత్రపటానికి పూలమాల వేసి జిల్లా కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ గోపాలక్రిష్ణలు నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. యోగివేమన తన పద్యం ద్వారా నీతిని సమాజానికి చాటి చెప్పారన్నారు.
News January 18, 2026
ప్రకాశం: ఫుల్‌గా తాగేశారు..!

ప్రకాశం జిల్లాలో సంక్రాంతి ఘనంగా జరిగింది. పండగల్లో మద్యం ప్రియులు తమ సత్తా చూపారు. 14వ తేదీ ఒక్కరోజే రూ.5.82 కోట్ల విలువైన మద్యం గౌడౌన్ నుంచి షాపులకు తరలింది. 15, 16వ తేదీల్లో గోడౌన్లకు సెలవు కావడంతో ముందుగా మద్యం షాపుల ఓనర్లు భారీగా మద్యం తీసుకు వచ్చారు. ఈనెల పదో తేదీ నుంచి 14వ తేదీ వరకు సుమారు రూ.23 కోట్ల వ్యాపారం జరిగినట్లు అధికారుల సమాచారం.
News January 18, 2026
ఇవాళ ప్రకాశం జిల్లాకు రానున్న ఇన్ఛార్జ్ మంత్రి

ప్రకాశం జిల్లా పర్యటన నిమిత్తం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదివారం రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఒంగోలులో జరిగే నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఇదే కార్యక్రమంలో జిల్లాకు చెందిన మంత్రి స్వామి, పలువురు ఎమ్మెల్యేలు సైతం పాల్గొననున్నారు.


