News March 18, 2024

ప్రకాశం: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

image

తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రకాశం జిల్లా వాసులు మృతి చెందారు. వోలేటివారిపాలెం మండలం కొండ సముద్రానికి చెందిన వేణుగోపాల్(32) జగిత్యాల జిల్లా కొండగట్టుకు వలస వెళ్లారు. నిన్న ఉదయం పసుపులేటి శ్రీకాంత్ (27), వెంకటేశ్ (33) కూలీలను తన బైక్‌పై తీసుకుని మెట్‌పల్లిలో మేస్త్రి పనులకు బయలుదేరాడు. జగిత్యాల-కోరుట్ల మార్గంలో వెంకటాపూర్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందారు.

Similar News

News February 12, 2026

ప్రకాశం: శివాలయాల వద్ద బందోబస్తు

image

కనిగిరి మండలంలోని అన్ని శివాలయాల వద్ద మహాశివరాత్రి పండగను పురస్కరించుకుని పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు కనిగిరి సీఐ శ్రీనివాసులు తెలిపారు. గురువారం మండలంలోని నందన మారెళ్ల కొండపై ఉన్న శివాలయాన్ని ఆయన సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్కింగ్, రద్దీ నియంత్రణపై ఆలయ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు.

News February 12, 2026

ప్రకాశం: ఆ 40 మందిలో మీ MLA ఉన్నారా..?

image

ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సుమారు 40 మంది ఎమ్మెల్యేల పనితీరు ఆశాజనకంగా లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. పనితీరు మార్చుకోని వారితో నేరుగా మాట్లాడతానని సీఎం వెల్లడించారు. మరి మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఆ 40 మందిలో మీ ఎమ్మెల్యే ఉన్నారని అనుకుంటున్నారా.. అయితే కామెంట్ చేయండి.

News February 12, 2026

ప్రకాశం: నిర్మాణాలపై జేసీ సూచనలు

image

ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో జరిగే భవన నిర్మాణాలకు అనుమతుల జారీలో జాప్యం ఉండరాదని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి స్పష్టం చేశారు. ఈ సంస్థకు వైస్ ఛైర్మన్‌గా ఉన్న ఆమె బుధవారం సిబ్బందితో ప్రకాశం భవనంలో ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి ప్రస్తుతం అమలవుతున్న ఎల్.ఆర్.ఎస్, బి.పి.ఎస్, భవన నిర్మాణ అనుమతులపై జేసీ ఆరా తీశారు.