News October 2, 2024
మంత్రి కొండా సురేఖకు ప్రకాశ్ రాజ్ కౌంటర్

TG: మంత్రి కొండా సురేఖకు నటుడు ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. ‘ఏంటీ సిగ్గులేని రాజకీయాలు? సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే అంత చిన్న చూపా? జస్ట్ ఆస్కింగ్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. సురేఖ మాట్లాడిన వీడియోను ట్యాగ్ చేశారు. కాగా నాగచైతన్య-సమంత విడాకులకు కేటీఆరే కారణమని సురేఖ ఆరోపించిన విషయం తెలిసిందే. అలాగే చాలామంది హీరోయిన్లకు ఆయన డ్రగ్స్ అలవాటు చేశారని ఆమె వ్యాఖ్యానించారు.
Similar News
News January 1, 2026
జల వివాదాలపై చర్చకు సర్కార్ సిద్ధం!

TG: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. కృష్ణా జలాల వివాదంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంలో BRSను ఎదుర్కోవడంపై సీఎం రేవంత్ సహా మంత్రులు సన్నద్ధమవుతున్నారు. కాసేపటి క్రితమే మంత్రి ఉత్తమ్ దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అసెంబ్లీలో జరిగే చర్చలో ఎలా వ్యవహరించాలనేదానిపై నేతలకు సీఎం కూడా దిశానిర్దేశం చేశారు.
News January 1, 2026
అలాంటి సీఎంతో మేం చర్చలు చేయాలా: KTR

TG: నదీ జలాలు, సాగునీటి అంశాలపై కనీస అవగాహన లేని CM అసెంబ్లీలో ఉపన్యాసాలు ఇవ్వబోతున్నారంటూ రేవంత్‌ను KTR విమర్శించారు. రేపు అసెంబ్లీలో నీటి ప్రాజెక్టులపై చర్చ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘భాక్రా నంగల్ ప్రాజెక్ట్ TGలో ఉందని CM అన్నారు. అది హిమాచల్ ప్రదేశ్‌లో ఉందన్న విషయం కూడా ఆయనకు తెలియదు. అలాంటి CMతో చర్చ చేయాలా’ అని ప్రశ్నించారు. BRSకు అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చే ఛాన్సివ్వాలన్నారు.
News January 1, 2026
IIT హైదరాబాద్ కుర్రాడికి ₹2.5 కోట్ల ప్యాకేజీ!

జాబ్ మార్కెట్ డల్‌గా ఉన్నా IIT హైదరాబాద్ స్టూడెంట్ ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్ హిస్టరీ క్రియేట్ చేశాడు. నెదర్లాండ్స్‌కు చెందిన ‘ఆప్టివర్’ అనే కంపెనీలో ఏకంగా ₹2.5 కోట్ల ప్యాకేజీ అందుకున్నాడు. సంస్థ చరిత్రలోనే ఇది హయ్యెస్ట్ ఆఫర్. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఎంపికైన ఈ 21 ఏళ్ల కుర్రాడు తన ఇంటర్న్‌షిప్‌ను ఏకంగా భారీ జాబ్‌గా మార్చుకున్నాడు. ఈ ఏడాది IITHలో సగటు ప్యాకేజీ 75% పెరిగి ₹36.2 లక్షలకు చేరడం విశేషం.


