News August 7, 2024

ఫొగట్‌ బరువు పెరగడంపై ప్రకాశ్ రాజ్ ట్వీట్

image

పారిస్ ఒలింపిక్స్‌లో పతాక బరిలో నిలిచిన భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్‌ అధిక బరువు కారణంగా డిస్‌క్వాలిఫై అవడంపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ వినూత్నంగా స్పందించారు. ఫైనల్‌కు ముందు ఫొగట్ బరువును చెక్ చేస్తుండగా ఓ వ్యక్తి కాలును ఉంచినట్లు తెలిపే కార్టూన్ ఫొటోను ఆయన షేర్ చేశారు. దీని గురించి మీరు ఏం అనుకుంటున్నారు అని ఆయన ప్రశ్నించారు. దీనిపై మీ కామెంట్?

Similar News

News January 16, 2025

పౌరులకు మానవతా సాయం అందించండి: యూఎన్ చీఫ్

image

ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు UN చీఫ్ అంటోనీ గుటెర్రస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఒప్పందానికి మధ్యవర్తిత్వం చేసిన ఈజిఫ్టు, ఖతార్, యూఎస్ఏను ఆయన అభినందించారు. బాధిత పౌరులకు అవసరమైన మానవతా సహాయాన్ని అందించాలని పిలుపునిచ్చారు. ఎదురయ్యే సవాళ్లను తెలుసుకొని సాధ్యమయ్యే ప్రతిదీ చేస్తామని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని యూకే ప్రధాని స్టార్మర్ స్వాగతించారు.

News January 16, 2025

ఇండియా ఓపెన్: ప్రణయ్, లక్ష్యసేన్ ఔట్

image

ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు నిరాశే ఎదురైంది. పురుషల సింగిల్స్‌లో స్టార్ ప్లేయర్లు లక్ష్యసేన్, ప్రణయ్ ఓటమి పాలయ్యారు. మహిళల సింగిల్స్‌లో మాళవిక, ఆకర్షి ఓడిపోయారు. మరోవైపు ఇవాళ స్టార్ ప్లేయర్ సింధు జపాన్ క్రీడాకారిణి సుజుతో తలపడనున్నారు. మరో ప్లేయర్ అనుపమ ఉపాధ్యాయ జపాన్‌కు చెందిన మియజాకితో పోటీ పడనున్నారు.

News January 16, 2025

‘పుష్ప-2’ టికెట్ ధరలు తగ్గింపు

image

ఈ నెల 17 నుంచి మరో 20 నిమిషాల అదనపు నిడివితో ‘పుష్ప-2’ ప్రదర్శితం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నైజాంతో పాటు నార్త్ ఇండియాలో టికెట్ రేట్లను చిత్ర యూనిట్ తగ్గించింది. నైజాంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.112, మల్టీప్లెక్స్‌లలో రూ.150గా ఫిక్స్ చేసినట్లు తెలిపింది. మరోవైపు నార్త్ ఇండియాలో రూ.112కే టికెట్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ మూవీ ఇప్పటికే రూ.1,800 కోట్లకు పైగా కలెక్షన్లు చేసింది.