News March 6, 2025

ప్రణయ్ హత్య కేసు.. 10న తీర్పు

image

TG: మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ఈ నెల 10న NLG అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు ఇవ్వనుంది. కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడన్న కక్షతో మారుతీరావు సుపారీ గ్యాంగ్‌తో ఈ హత్య చేయించాడని పోలీసులు రిపోర్టులో పేర్కొన్నారు. 78 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టి, ఎనిమిది మంది నిందితులపై ఛార్జ్‌షీటు దాఖలు చేశారు. A1 మారుతీరావు ఆత్మహత్య చేసుకోగా, తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

Similar News

News April 4, 2026

పశ్చిమాసియా యుద్ధం.. నిర్మాణ రంగంపై భారం

image

పశ్చిమాసియా యుద్ధం దేశంలో నిర్మాణ రంగంపై పడింది. రంగులు, స్టీల్, సిమెంట్, టైల్స్, శానిటరీ వేర్ రేట్లు పెరిగాయి. పెట్రోలియం అనుబంధ ఉత్పత్తుల కొరతే దీనికి కారణం. బస్తా సిమెంట్ ధర ₹50 పెరగగా, స్టీల్ ధర టన్నుకు 18% పెరిగింది. ప్రొపేన్ గ్యాస్ సరఫరా తగ్గడంతో శానిటరీ వేర్ ధరలు 8-12% పెరిగినట్లు తెలుస్తోంది. ఇంధన కొరత సాకుతో రవాణా ఛార్జీల రూపంలో ఇటుక ధరలు కూడా ₹8 నుంచి ₹10-12కు పెంచినట్లు సమాచారం.

News April 4, 2026

నేవీ అమ్ములపొదిలోకి ‘అరిదమన్’

image

భారతీయ నౌకాదళంలోకి స్వదేశీ సాంకేతికతతో తయారైన అణు జలాంతర్గామి ‘అరిదమన్’ చేరింది. దీంతో నేవీ అమ్ములపొదిలోని న్యూక్లియర్ సబ్‌మెరైన్‌ల సంఖ్య మూడుకు పెరిగింది. ఇది INS అరిఘాట్, INS అరిహంత్‌తో పోలిస్తే అప్‌గ్రేడెడ్ వెర్షన్. ఈ జలాంతర్గామి 3,500 కిలోమీటర్ల రేంజ్‌‌కు వెళ్లే అణుసామర్థ్యం గల ఎనిమిది కే-4 మిసైళ్లను మోయగలదు. దీంతో పాటు 24 K-15 సాగరిక న్యూక్లియర్ మిసైల్స్‌ను కూడా మోసే సామర్థ్యం ఉంది.

News April 4, 2026

ఓడామని వదలొద్దు.. ప్రయత్నిస్తే విజయం తథ్యం

image

అనగననగ రాగమతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ!
తాత్పర్యం: సంగీతం రానివారైనా రాగాలను పదేపదే ఆలపిస్తూ ఉంటే కొన్నాళ్లకు వినసొంపుగా పాడగలుగుతారు. వేప ఆకులు చేదుగా ఉన్నా రోజూ తింటూ ఉంటే కొన్నాళ్లకు తియ్యగా అనిపిస్తాయి. ఏ రంగమైనా సాధనతో నైపుణ్యం పెరిగి రాణిస్తారు. తొలిసారి విఫలమైనా తుదకు విజయం సాధిస్తారు.