News July 8, 2025
ప్రశాంతిపై ప్రసన్న అనుచిత వ్యాఖ్యలు చేయలేదు: అనిల్

AP: క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలపై విచారణ జరిపితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డే జైలుకు వెళ్లాల్సి వస్తుందని వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. టీడీపీ నేతల అక్రమ కేసులకు వైసీపీ నేతలు భయపడరని చెప్పారు. ‘ప్రశాంతిపై నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. ప్రసన్నను చంపేందుకే వేమిరెడ్డి అనుచరులు ఇంటికి వచ్చారు. ఆయన లేకపోవడంతో ఇంటిని ధ్వంసం చేశారు’ అని ఆయన ఆరోపించారు.
Similar News
News July 8, 2025
రేపు హాల్‌టికెట్లు విడుదల

AP: రాష్ట్రంలోని ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పరీక్షల హాల్‌టికెట్లు రేపు విడుదల కానున్నాయి. అభ్యర్థులు ఇక్కడ <
News July 8, 2025
జగన్ కారులో కూర్చున్నందుకు నాపై కేసు: పేర్ని నాని

AP: ఇటీవల మాజీ CM జగన్ కారులో వెనుక సీట్లో కూర్చుని ప్రయాణించినందుకు కూటమి సర్కార్ తనపై కేసు పెట్టిందని YCP నేత పేర్ని నాని మండిపడ్డారు. మరి గోదావరి పుష్కరాల్లో 30 మంది మృతికి కారకుడైన చంద్రబాబుపై తమ ప్రభుత్వం వచ్చాక కేసులు పెడితే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ‘రాష్ట్ర ప్రభుత్వ కక్షపూరిత చర్యలకు 2029లో దీటుగా సమాధానం చెబుతాం. చెడు సంప్రదాయాలకు తెర తీస్తే పాపం అనుభవించక తప్పదు’ అని ఆయన హెచ్చరించారు.
News July 8, 2025
లక్ అంటే ఇతడిదే..

బిట్‌కాయిన్ విలువ కొన్నేళ్లలోనే లక్షల రెట్లు పెరిగిన విషయం తెలిసిందే. ఇది ఓ వ్యక్తిని బిలియనీర్‌ను చేసిన ఘటనపై నెట్టింట చర్చ జరుగుతోంది. ఓ వ్యక్తి 14 ఏళ్ల క్రితం APR 3, 2011న బిట్‌కాయిన్ ప్రారంభంలో $7,800 విలువైన టోకెన్లను కొన్నారు. ప్రస్తుతం ఈ టోకెన్ల విలువ 140,000 రెట్లు పెరిగింది. దీంతో ఆయనకు చెందిన 10,000 బిట్‌కాయిన్లను విక్రయించగా అతనికి $1.09 బిలియన్లు (సుమారు ₹9,300కోట్లు) లభించాయి.