News January 7, 2025
ఆస్పత్రిలో చేరిన ప్రశాంత్ కిషోర్

జైలు నుంచి విడుదలైన జన్ సురాజ్ ఫౌండర్ ప్రశాంత్ కిషోర్ డీహైడ్రేషన్, ఇన్ఫెక్షన్తో ఆస్పత్రిలో చేరారు. బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పట్నాలోని గాంధీ మైదాన్ వద్ద జనవరి 2న ఆయన ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. దీంతో PKను పోలీసులు Mon అరెస్టు చేశారు. తాజాగా ఆయనకు బెయిల్ మంజూరైంది. ఆస్పత్రిలో చేరినా తన దీక్షను కొనసాగిస్తానని PK తెలిపారు.
Similar News
News October 20, 2025
ఇలాంటి క్షణాలు హృదయాన్ని ఆనందంతో నింపేస్తాయి: చిరంజీవి

నాగార్జున, వెంకటేశ్, నయనతారతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నట్లు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ‘ఇలాంటి క్షణాలు హృదయాన్ని ఆనందంతో నింపేస్తాయి. ప్రేమ, నవ్వు, కలిసి ఉండటం వల్ల జీవితం వెలిగిపోతుందన్న విషయాన్ని గుర్తు చేస్తాయి’ అని ట్వీట్ చేశారు. కాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీలో హీరోయిన్గా నయనతార, స్పెషల్ రోల్లో వెంకీ మామ కనిపించనున్నారు.
News October 20, 2025
రేపు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు ఏపీలోని బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అటు తెలంగాణలో రేపు అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News October 20, 2025
మేం మొదలుపెడితే తట్టుకోలేరు.. కేతిరెడ్డిపై జేసీ ఫైర్

AP: ధర్మవరం మాజీ MLA కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ‘ఇదే మీకు లాస్ట్ దీపావళి అని కేతిరెడ్డి అంటున్నారు. అలా అంటే చూస్తూ ఊరుకోవాలా? మేం మొదలుపెడితే మీరెవరూ తట్టుకోలేరు’ అని ఫైరయ్యారు. ఆయన ఆలోచించి మాట్లాడాలని, భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేరని అన్నారు.