News November 24, 2024
ప్రశాంత్ కిశోర్ పార్టీకి బిహార్‌లో పరాభవం
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీకి మొదటి రాజకీయ పరాభవం ఎదురైంది. బిహార్‌లో నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు కనీస ప్రభావం చూపలేకపోయారు. తరారీ, రామ్‌గఢ్, బెలగంజ్, ఇమామ్‌గంజ్ స్థానాలను అధికార ఎన్డీయే కైవసం చేసుకుంది. విపక్ష ఆర్జేడీ రెండో స్థానంలో నిలవగా, జన్ సురాజ్ మూడో స్థానానికి పరిమితమైంది.
Similar News
News November 24, 2024
బలపడిన అల్పపీడనం.. 27 నుంచి భారీ వర్షాలు
AP: ఆగ్నేయ బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలపడిందని APSDMA వెల్లడించింది. ఇది రేపు వాయుగుండంగా మారుతుందని తెలిపింది. ఆ తర్వాత వాయవ్య దిశగా తమిళనాడు, శ్రీలంక తీరాలవైపు కదులుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈనెల 27 నుంచి 30 వరకు కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
News November 24, 2024
IPLలో రికార్డ్ ధరలు.. ఇద్దరూ ఇండియన్సే!
రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ IPL-2025 వేలంలో రికార్డు ధర పలికారు. పంత్‌ను లక్నో రూ.27 కోట్లు, అయ్యర్‌ను రూ.26.75 కోట్లకు పంజాబ్ సొంతం చేసుకుంది. లీగ్ చరిత్రలో అత్యధిక ధర పలికిన వీరిద్దరూ టీమ్ఇండియా బ్యాటర్లు కావడం విశేషం. మొన్నటి వరకు స్టార్క్ రూ.24.75 కోట్లతో ఖరీదైన ప్లేయర్‌గా ఉన్నారు. ఇండియన్ లీగ్‌లో ఇతర దేశాల ప్లేయర్లకు భారీగా వెచ్చించడం పట్ల గతంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమైన విషయం తెలిసిందే.
News November 24, 2024
అక్కడ ఆఫీసర్ల కంటే ఖైదీలకే జీతాలెక్కువ..!
యూకేలోని జైళ్లలో ఖైదీల ఆదాయం అక్కడి అధికారులు, టీచర్ల కంటే ఎక్కువగా ఉంది. ఒక్కో ఖైదీ ఏడాదికి సుమారుగా రూ.39 లక్షలు సంపాదిస్తారు. కొంచెం పని తక్కువ చేసే ఖైదీలు ఏటా రూ.24 లక్షలు గడిస్తారు. ఇది అక్కడి జైలు గార్డు జీతంతో దాదాపుగా సమానం. గార్డులకు రూ.29 లక్షల వరకు జీతమిస్తారు. కాగా అక్కడి ఖైదీలు జైల్లో నుంచి బయటకు వెళ్లి పనులు చేసుకోవచ్చు. లారీ, బస్సు డ్రైవర్లుగా కూడా వారు పనిచేస్తున్నారు.