News September 27, 2024

ప్రశాంత్ వర్మ చేతికి బాలయ్య ల్యాండ్ మార్క్ సినిమాలు?

image

నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఆదిత్య 369, భైరవ ద్వీపం సినిమాలు రెండు మైలురాళ్లు. వాటి సీక్వెల్స్ ఆలోచన తనకుందని ఆయన పలుమార్లు చెప్పారు. ఇప్పుడు ఆ బాధ్యతను హను-మాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టారని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. మోక్షజ్ఞ హీరోగా అవి తెరకెక్కుతాయని సమాచారం. ప్రశాంత్ మోక్షుతో తీస్తున్న సినిమా అవుట్‌పుట్‌ను బట్టి ఆ ప్రాజెక్టుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది.

Similar News

News September 27, 2024

రూ.6.61 లక్షల కోట్ల రుణం సేకరించనున్న కేంద్రం

image

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి 6 నెలల్లో రూ.6.61 లక్షల కోట్ల రుణాన్ని కేంద్రం సమీకరించనుంది. ఇందుకోసం అక్టోబర్- మార్చి మధ్య రూ.20 వేల కోట్ల సావరిన్ బాండ్లతో పాటు సెక్యూరిటీల వేలం నిర్వహించనుంది. ఈ మొత్తంతో రెవెన్యూ లోటు భర్తీ చేయనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.14.01 లక్షల కోట్ల రుణాన్ని సేకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే తొలి 6 నెలల్లో రూ.7.4 లక్షల కోట్లను సేకరించింది.

News September 27, 2024

28న రాష్ట్రానికి రానున్న జేపీ నడ్డా

image

TG: ఈ నెల 28న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రానికి రానున్నారు. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని ఆయన దర్శించుకోనున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ నేతలతో సమావేశమవుతారు. బేగంబజార్లో నిర్వహించే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నడ్డా పాల్గొంటారు.

News September 27, 2024

పునరావసం కల్పించాకే ఇళ్లు కూల్చండి: తమ్మినేని

image

TG: మూసీ అభివృద్ధి పేరుతో పేదలను ఇబ్బందులకు గురి చేయొద్దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని కోరారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు పునరావాసం కల్పించిన తర్వాతే ఇళ్లను కూల్చే పనులు చేపట్టాలన్నారు. రోజువారీ కూలీ పనులు చేసుకునే బలహీనవర్గాల ప్రజలే అక్కడ ఎక్కువగా ఉన్నారని తెలిపారు. వారికి HYD శివార్లలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తే పనులకు వెళ్లేందుకు కష్టతరంగా మారుతుందని తెలిపారు.