News February 25, 2025
ఫైబర్ నెట్ కొత్త ఎండీగా ప్రవీణ ఆదిత్య

AP: రాష్ట్ర ఫైబర్ నెట్ కొత్త ఎండీగా ప్రవీణ ఆదిత్యను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పాత ఎండీ దినేశ్ కుమార్ అవినీతికి పాల్పడ్డారని <<15567607>>జీవీ రెడ్డి<<>>(ఫైబర్ నెట్ మాజీ ఛైర్మన్) ఆరోపించిన విషయం తెలిసిందే. నిన్న తన పదవికి ఆయన రాజీనామా చేయగా ప్రభుత్వం వెంటనే ఆమోదించింది. ఆ తర్వాత దినేశ్‌ను జీఏడీకి అటాచ్ చేసింది. ఇవాళ కొత్త ఎండీని నియమించింది.
Similar News
News February 25, 2025
రోహిత్‌ను డిన్నర్ పార్టీ అడుగుతా: అక్షర్

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో రోహిత్ క్యాచ్ డ్రాప్ చేసి అక్షర్ హ్యాట్రిక్ మిస్ చేశారు. దీంతో డిన్నర్‌కు <<15528906>>తీసుకెళ్తానంటూ<<>> హిట్ మ్యాన్ ఇచ్చిన ఆఫర్‌పై ఆల్‌రౌండర్ స్పందించారు. ‘టీమ్ ఇప్పటికే సెమీస్‌కు క్వాలిఫై అయ్యింది. పైగా కివీస్‌తో తర్వాతి మ్యాచ్‌కు ఆరు రోజుల సమయం ఉంది. రోహిత్‌ను డిన్నర్ పార్టీ అడగడానికి ఛాన్స్ వచ్చింది’ అని పేర్కొన్నారు.
News February 25, 2025
ఆ స్కూళ్లలో తెలుగు తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు

TG: సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ బోధించే స్కూళ్లలో తప్పనిసరి సబ్జెక్టుగా తెలుగు ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. సింగిడి(స్టాండర్డ్ తెలుగు) స్థానంలో సులభతర తెలుగు వాచకం ‘వెన్నెల’ను 9, 10వ తరగతుల్లో బోధించాలని స్పష్టం చేసింది. 1-10 క్లాసుల వరకు తెలుగు బోధన, పరీక్షలు నిర్వహించాలని ఆయా బోర్డులను ఆదేశించింది. గత ప్రభుత్వం తెలుగును పూర్తిస్థాయిలో అమలు చేయలేదని పేర్కొంది.
News February 25, 2025
పట్టాలెక్కనున్న రవితేజ ‘డబుల్ ధమాకా’?

రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ‘ధమాకా’ 2022లో విడుదలై రూ.100 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘డబుల్ ధమాకా’ తెరకెక్కనున్నట్లు సమాచారం. దర్శకుడు త్రినాథరావు ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ చేశారని, మాస్ మహారాజా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని వార్తలు వస్తున్నాయి.