News February 28, 2025
నమాజ్ వేళలు.. ఫిబ్రవరి 28, శుక్రవారం

ఫజర్: తెల్లవారుజామున 5.23 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.35 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.29 గంటలకు
అసర్: సాయంత్రం 4.44 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.22 గంటలకు
ఇష: రాత్రి 7.35 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News January 9, 2026
BJP కొత్త ఆయుధంగా సెన్సార్ బోర్డు: స్టాలిన్

సెన్సార్ బోర్డుపై తమిళనాడు CM స్టాలిన్ ఫైర్ అయ్యారు. CBI, ED, IT శాఖ మాదిరే ఇప్పుడు సెన్సార్ బోర్డు BJP కొత్త ఆయుధంగా మారిందని ఆరోపించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ట్వీట్ చేశారు. శివకార్తికేయన్ నటించిన ‘పరాశక్తి’ మూవీ విషయంలోనే ఆయన స్పందించినట్లు తెలుస్తోంది. మొత్తం 25కట్స్ సూచిస్తూ U/A సర్టిఫికెట్‌ను CBFC జారీ చేసింది. 1965 యాంటీ హిందీ ఆందోళన ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీకి DMK సపోర్ట్ ఉంది.
News January 9, 2026
తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం

తిరుమల కల్తీ నెయ్యి కేసులో A-34గా ఉన్న TTD డెయిరీ నిపుణుడు విజయభాస్కర్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం నెల్లూరు ACB కోర్టులో పిటిషన్ వేశారు. నెయ్యి క్వాలిటీ లేకున్నా ఆయన లంచాలు తీసుకుని సర్టిఫికెట్లు ఇచ్చారని ప్రభుత్వ లాయర్ వాదించారు. భోలేబాబా కంపెనీ నుంచి రూ.75లక్షలు, ప్రీమియర్ నుంచి రూ.8L, అల్ఫా నుంచి 8 గ్రా. గోల్డ్ తీసుకున్నట్లు సిట్ గుర్తించిందన్నారు. దీంతో కోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.
News January 9, 2026
పెద్దల పడక గది ఏ దిక్కున ఉండాలి?

ఇంటి పెద్దల పడకగది నైరుతి, వాయువ్య మూలల్లో ఉంటే మంచిదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. దక్షిణ, పడమర దిశలు కలిసే నైరుతి గది కుటుంబ యజమానికి అత్యంత సౌకర్యాన్ని, ప్రశాంతతను ఇస్తుందంటున్నారు. ‘ఈ దిశలో గాలి, వెలుతురు బాగా వస్తుంది. గాఢ నిద్రతో ఆరోగ్యం బాగుంటుంది. బాధ్యత గల పెద్దలకు ఈ దిశ చాలా అనుకూలం. ఇంటి అభివృద్ధిని కోరేవారు యజమానికై నైరుతి దిశ కేటాయించాలి’ అని సూచిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>


