News February 26, 2025
నమాజ్ వేళలు.. ఫిబ్రవరి 26, బుధవారం

ఫజర్: తెల్లవారుజామున 5.24 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.36 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.29 గంటలకు
అసర్: సాయంత్రం 4.44 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.22 గంటలకు
ఇష: రాత్రి 7.34 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News January 20, 2026
హ్యాపీగా ఉండాలంటే ఈ ఆహారం తినండి

మనల్ని ఆనందంగా ఉంచే హార్మోన్ అయిన డోపమైన్ ఆహారంలోనూ దొరుకుతుందట. ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. బెర్రీస్, అరటిపండ్లు, నట్స్, ఫ్యాటీ ఫిష్, ప్రోబయాటిక్స్, ఓట్స్, ఆకుకూరలు, గుడ్లు, అవకాడో వంటివి ఆహారంలో చేర్చుకోవడంవల్ల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. వీటి వల్ల మూడ్ బాగుండటమే కాకుండా మెంటల్ క్లారిటీ, డిప్రెషన్ లక్షణాలు తగ్గించి ఎమోషనల్ హెల్త్ బావుండేలా చూస్తాయంటున్నారు నిపుణులు.
News January 20, 2026
27న అఖిలపక్ష భేటీ.. అన్ని పార్టీలకు కేంద్రం ఆహ్వానం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈనెల 27వ తేదీన అఖిలపక్ష భేటీ నిర్వహించనున్నట్టు కేంద్రం తెలిపింది. ఈ భేటీకి హాజరుకావాలని లోక్సభలో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీలకు లేఖలు పంపింది. పార్లమెంట్ సమావేశాలకు అన్ని పార్టీలు సహకరించాలని ఈ భేటీలో కోరనుంది. పార్లమెంట్లో చర్చించే అంశాలు, బిల్లుల వివరాలను విపక్షాలకు అందజేయనుంది. కాగా JAN 28 నుంచి <<18812112>>బడ్జెట్ సమావేశాలు<<>> ప్రారంభం కానున్నాయి.
News January 20, 2026
‘జన నాయగన్’పై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

విజయ్ హీరోగా నటించిన ‘జన నాయగన్’ సినిమా సెన్సార్ వివాదంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ మూవీకి U/A సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సీబీఎఫ్సీ దాఖలు చేసిన అప్పీల్పై తీర్పును మద్రాస్ హైకోర్టు రిజర్వ్ చేసింది. చీఫ్ జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, జస్టిస్ జి. అరుల్ మురుగన్లతో కూడిన డివిజన్ బెంచ్ ముందు ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి. అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది.


