News May 20, 2024
ఇబ్రహీం క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా: మోదీ

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైన ఘటనపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విపత్తు సమయంలో ఇరాన్ ప్రజలకు తాము సంఘీభావంగా నిలుస్తామన్నారు. అధ్యకుడు ఇబ్రహీం, అతనితో పాటు ఉన్నవారి క్షేమం కోసం ప్రార్థిస్తున్నామని ట్వీట్ చేశారు. కాగా ఇబ్రహీం అజర్బైజాన్ పర్యటనకు వెళ్తుండగా జోల్పా సిటీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఆయన ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.
Similar News
News January 17, 2026
నేటి ముఖ్యాంశాలు

✴ 70వేల ఉద్యోగాలు భర్తీ చేశాం: సీఎం రేవంత్
✴ ఉమ్మడి ఆదిలాబాద్‌లో సదర్మట్, చనాక-కొరాటా బ్యారేజీలను ప్రారంభించిన సీఎం
✴ మేడారంలో ఒక్కరోజే 6 లక్షల మంది భక్తుల దర్శనం
✴ మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల
✴ ఏపీకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి: లోకేశ్
✴ రాజకీయ కక్షలతో ఇంకెంతమందిని బలితీసుకుంటారు?: జగన్
✴ ‘సంక్రాంతి’ తిరుగు ప్రయాణాలు.. బస్సులు, రైళ్లలో రద్దీ
News January 17, 2026
WPL: RCB హ్యాట్రిక్ విజయం

WPLలో ఆర్సీబీ వరుసగా మూడో విజయాన్ని అందుకుంది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 182 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ తడబడినా రాధా యాదవ్ 66 పరుగులతో జట్టును నిలబెట్టారు. రిచా ఘోష్ 44 పరుగులతో మద్దతు ఇవ్వగా, చివర్లో క్లర్క్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఛేజింగ్‌లో గుజరాత్ 150 పరుగులకు పరిమితమైంది. శ్రేయాంక పాటిల్ 5 వికెట్లు తీశారు.
News January 17, 2026
ఆ ప్లేయర్‌ను చివరి వన్డేలోనైనా ఆడించండి: అశ్విన్

న్యూజిలాండ్‌తో రెండు వన్డేలకు బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను బెంచ్‌కే పరిమితం చేయడంపై మాజీ క్రికెటర్ అశ్విన్ అసహనం వ్యక్తం చేశారు. కనీసం మూడో వన్డేలోనైనా అతడిని ఆడించాలని సూచించారు. అర్ష్‌దీప్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడని, జట్టు విజయాల్లో భాగమయ్యాడని తెలిపారు. అయినా టీమ్‌లో స్థానం కోసం పోరాడుతున్నాడని చెప్పారు. బ్యాటర్ల విషయంలో ఇలా జరగదని, ప్రతిసారీ బౌలర్లే బలవుతున్నారని పేర్కొన్నారు.


