News October 19, 2025
వరి కోత తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వరి కోత సమయంలో గింజలో 22-27 శాతం తేమ ఉంటుంది. నూర్పిడి చేశాక ధాన్యాన్ని టార్పలిన్ లేదా ప్లాస్టిక్ పట్టాలపై 3 నుంచి 4 రోజుల పాటు పలుచగా ఆరబెట్టాలి. దీని వల్ల గింజ రంగు మారకుండా నల్లగా కాకుండా మంచి నాణ్యత కలిగి ఉంటుంది. నూర్పిడి చేశాక ఒకసారి తూర్పార పడితే పంట అవశేషాలు, తాలుగింజలు పోతాయి. మార్కెట్‌లో కనీస మద్దతు ధర రావాలంటే దెబ్బతిన్న, మొలకెత్తిన, పుచ్చుపట్టిన గింజలు 4 శాతం మించకుండా చూసుకోవాలి.
Similar News
News October 19, 2025
టాస్ ఓడిన భారత్

తొలి వన్డే: భారత్‌తో పెర్త్‌లో జరగనున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ వన్డేల్లో అరంగేట్రం చేస్తున్నారు.
జట్లు:
IND: రోహిత్, గిల్(C), కోహ్లీ, శ్రేయస్, రాహుల్, అక్షర్ పటేల్, సుందర్, నితీశ్ కుమార్, హర్షిత్ రాణా, సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్
AUS: హెడ్, మార్ష్(C), షార్ట్, ఫిలిప్, రెన్‌షా, కొన్నోలీ, ఓవెన్, స్టార్క్, ఎల్లిస్, కున్హెమన్, హేజిల్‌వుడ్
News October 19, 2025
దీపావళి దీపాలు: ఈ తప్పులు చేయకండి

దీపావళి పర్వదినాన దీపాలు పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. తడి ప్రమిదల్లో దీపాలు వెలిగించరాదని అంటున్నారు. ‘బొట్టు లేకుండా దీపారాధన చేయకూడదు. దీపం వెలిగించే సమయంలో మౌనం పాటించాలి. జ్యోతిని ఏక హారతితో వెలిగించడం ఉత్తమం. ఒకే వత్తిని ఉపయోగించకూడదు. రెండు లేదా మూడు వత్తులతో దీపాలు పెట్టడం శుభకరం. ఈ నియమాలు పాటించి, పవిత్ర దీపకాంతిని స్వాగతించాలి’ అని సూచిస్తున్నారు.
News October 19, 2025
చికెన్ ధరలు ఎలా ఉన్నాయంటే?

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు కొన్ని చోట్ల స్వల్పంగా పెరగ్గా, మరికొన్ని ప్రాంతాల్లో స్థిరంగా ఉన్నాయి. APలోని చిత్తూరు, కృష్ణా, పల్నాడులో KG ధర రూ.220-240, గుంటూరులో రూ.200-220గా ఉంది. అటు TGలోని HYDలో కిలో రూ.220-240, వరంగల్, హన్మకొండలో రూ.210-230కు విక్రయిస్తున్నారు. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయి? COMMENT