News October 7, 2025
నీట మునిగిన మిరప పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పొలంలో నీటిని బయటకు పంపాలి. వడలిన మొక్కలకు లీటరు నీటికి 5గ్రా. మెగ్నీషియం సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి. ఇనుపధాతు లోపంతో మొక్కలు పాలిపోయినట్లుంటే 10 లీటర్ల నీటికి 50గ్రా. అన్నభేదితో పాటు ఒక నిమ్మ చెక్క రసం కలిపి పిచికారీ చేయాలి. మొక్కలు తేరుకున్నాక లీటరు నీటికి 5గ్రా. స్థూలపోషకాల మిశ్రమం, లీటరు నీటికి 2.5గ్రా. సూక్ష్మపోషకాల మిశ్రమం కలిపి ఒకదాని తర్వాత ఒకటి వారం వ్యవధిలో 2,3సార్లు పిచికారీ చేయాలి.
Similar News
News January 28, 2026
కుప్పకూలిన విమానం.. కారణమిదే

మహారాష్ట్ర బారామతి ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ అవుతుండగా స్కిడ్ అయినట్లు తెలుస్తోంది. దీంతో రన్‌వే నుంచి పక్కకు వెళ్లి కూలిపోవడంతో విమానంలో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఫ్లైట్‌పై పైలట్ పూర్తిగా పట్టుకోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ప్రమాదానికి గురైన Learjet 45 ఎయిర్‌క్రాఫ్ట్‌ను VSR సంస్థ ఆపరేట్ చేస్తోంది. ఈ దుర్ఘటనలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా ఆరుగురు <<18980385>>మరణించారు.<<>>
News January 28, 2026
BREAKING: కేజీ సిల్వర్ రూ.4,00,000

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. KG సిల్వర్ రేటు ఏకంగా రూ.13వేలు పెరిగి రూ.4,00,000కు చేరింది. అటు 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.3,220 పెరిగి రూ.1,65,170గా ఉంది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.2,950 ఎగబాకి రూ.1,51,400 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News January 28, 2026
బాబాయ్ బాటలో ప్రజాసేవలోకి..

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ సోదరుడి కొడుకైన అజిత్ అనంతరావ్ పవార్ తన బాబాయ్ బాటలో ప్రజాసేవలోకి వచ్చారు. 1959 జులై 22న జన్మించిన అజిత్ మొదట 1982లో షుగర్ ఫ్యాక్టరీ సంఘం ఎన్నికల్లో గెలిచారు. 1991లో బారామతి నుంచి MPగా చట్టసభలోకి అడుగుపెట్టారు. అదే ఏడాది బారామతి MLAగా గెలిచి ఎనిమిది సార్లు ప్రాతినిధ్యం వహించారు. MHలో పలు ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు.


