News September 23, 2025

కోళ్ల దాణా నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

కోళ్లకు మంచి దాణా అందించినప్పుడే వాటి పెరుగుదల బాగుంటుంది. అయితే దాణా నిల్వలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెటర్నరీ అధికారులు సూచిస్తున్నారు. దాణా బస్తాలను నేలపై కాకుండా చెక్క పలకల మీద ఉంచాలి. గోడలకు తగలకుండా చూడాలి. తేమగా ఉన్న దాణాను నిల్వ చేయకూడదు. 2-3వారాలకు మించి దాణా నిల్వ ఉంచకూడదు. వేడిగా ఉన్న దాణాను చల్లబడిన తర్వాత మాత్రమే గోదాముల్లో నిల్వ ఉంచాలి. లేదంటే బస్తాలపై తేమ ఏర్పడి బూజు పడుతుంది.

Similar News

News September 23, 2025

H-1B వీసా: డాక్టర్లు, ఫిజీషియన్లకు ఊరట!

image

H-1B వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచిన US పలు <<17776599>>మినహాయింపులు<<>> ఇచ్చిన విషయం తెలిసిందే. జాతీయ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని కీలక రంగాలకు ఊరటనిచ్చింది. ఇది డాక్టర్లు, ఫిజీషియన్లకూ వర్తించే అవకాశముంది. వైద్య, ఆరోగ్య పరిశోధనలు, రక్షణ, జాతీయ భద్రత, ఇంధనం, విమానయానం, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో పనిచేసేవారికి మినహాయింపునిచ్చింది. వీటిలో నిపుణులకు ప్రత్యామ్నాయం కష్టమనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

News September 23, 2025

ఫాస్ట్‌ఫుడ్‌తో సంతానోత్పత్తి సమస్యలు

image

ఫాస్ట్‌ఫుడ్స్ వలన అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని అందరికీ తెలిసిందే. ఆడవారిలో వీటివల్ల సంతానోత్పత్తి సమస్యలు వస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అడిలైడ్‌లోని రాబిన్‌సన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సైంటిస్టులు చేసిన అధ్యయనంలో పిజ్జా, బర్గర్లు, ఫ్రైడ్ ఫుడ్స్‌లో పెర్ఫ్లూక్టేనోయిక్ యాసిడ్, పెర్ఫ్లూరూక్టేన్ సల్ఫోనేట్ కలుస్తాయని వెల్లడైంది. ఇవి మహిళల్లో వంధ్యత్వానికి కారణమవుతాయని తేలింది.

News September 23, 2025

పశువుల్లో సంక్రమిత వ్యాధులు అంటే ఏమిటి?

image

పాడి పశువులకు సోకే వ్యాధుల్లో చాలావరకు బాక్టీరియా, వైరస్‌, ఫంగస్‌, పరాన్నజీవుల వల్లే వస్తాయి. వ్యాధి సోకిన పశువుల మలమూత్రాలు, స్రావాలు, శ్వాస ద్వారా వ్యాధికారక సూక్ష్మజీవులు బయటకు విడుదలవుతాయి. ఇవి ఇతర పశువులకు ఆహారం, నీరు, గాలి, గాయాల ద్వారా వ్యాపిస్తాయి. వ్యాధి సోకిన పశువుల పాలను సరిగా మరిగించకుండా, మాంసాన్ని బాగా ఉడికించకుండా తింటే మనుషులకూ వ్యాపిస్తాయి. వీటినే ‘సంక్రమిత వ్యాధులు’ అంటారు.