News August 21, 2024
ప్రిడేటరీ ప్రైసింగ్ అంటే..

ఇదొక వ్యాపార వ్యూహం. ఏదైనా రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న కంపెనీలు తమ ఉత్పత్తులకు తక్కువ ధరలు నిర్ణయిస్తాయి. కొన్నిసార్లు తమకయ్యే ఖర్చు కన్నా తక్కువ ధర పెట్టి నష్టాలను భరిస్తాయి. కస్టమర్లను పెంచుకొని పోటీ సంస్థలను తొక్కేస్తాయి. మోనోపలి స్థాయికి చేరాక అమాంతం ధరలు పెంచేసి, క్వాలిటీ తగ్గించి కస్టమర్లకు ఛాయిస్ లేకుండా చేస్తాయి. వేగంగా నష్టాల్ని పూడ్చుకొని లాభాలు గడిస్తాయి. చాలా దేశాల్లో ఇది నేరం.
Similar News
News November 26, 2025
గుంటూరు యార్డులో ‘ఘాటైన’ ధరలు

గుంటూరు మిర్చి యార్డుకు బుధవారం 90 వేల బస్తాల ఏసీ సరుకు పోటెత్తింది. మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రత్యేకంగా ‘యల్లో రకం’ మిర్చి ధర ఘాటెక్కింది. కిలో రూ.200 నుంచి రూ.250 వరకు పలికి రికార్డు సృష్టించింది. ముఖ్యమైన ధరలు (కిలోకు) 2043 ఏసీ: గరిష్ఠంగా రూ.200. నంబర్-5, 341 రకాలు రూ.180 వరకు, బంగారం, బుల్లెట్ రూ.175. తేజా ఏసీ రూ.120-152, ఇక సీడు తాలు రూ.60-90 వరకు ధర పలికాయి.
News November 26, 2025
‘పీఎం కుసుమ్’తో సాగులో సోలార్ వెలుగులు

TS: వచ్చే 4 ఏళ్లలో వ్యవసాయ బోర్లకు పెద్ద ఎత్తున సౌర విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. PM కుసుమ్ పథకం కింద వచ్చే నాలుగేళ్లలో 28.60 లక్షల బోర్లకు రాయితీలు, 4,500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను రైతు సంఘాలతో ఏర్పాటుకు అనుమతివ్వాలని కేంద్రాన్ని TG ప్రభుత్వం కోరింది. అలాగే రైతులు తమ పొలాల్లో సొంతంగా ఏర్పాటు చేసుకునే సోలార్ ప్యానల్స్కు రాయితీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది.
News November 26, 2025
ఇండోనేషియాలో తుఫాన్ బీభత్సం.. 8 మంది మృతి

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘సెన్యార్’ తుఫాన్ ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో బీభత్సం సృష్టిస్తోంది. అతిభారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో 8 మంది మరణించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇవాళ రాత్రికి తుఫాన్ తీరం దాటనున్నట్లు అక్కడి అధికారులు భావిస్తున్నారు. మరోవైపు భారత్లోని తమిళనాడు, కేరళ, అండమాన్ & నికోబార్పై సెన్యార్ ప్రభావం చూపుతోంది. ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.


