News April 5, 2024
మ్యాచ్ విన్నర్లతో ప్రీతి

గుజరాత్ టైటాన్స్‌తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే, పంజాబ్ గెలుపులో కీలకంగా ఆడిన శశాంక్ సింగ్, అశుతోష్ శర్మలను జట్టు ఓనర్ ప్రీతి జింటా అభినందించారు. మ్యాచ్ తర్వాత విన్నర్స్‌తో దిగిన సెల్ఫీని ట్విటర్లో పంచుకున్నారు. ‘థ్రిల్లింగ్ రన్ ఛేజ్‌లో గుజరాత్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించిన విధానాన్ని కచ్చితంగా అందరూ ఇష్టపడతారు’ అని ఆమె ట్వీట్ చేశారు.
Similar News
News November 19, 2025
సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు గిల్ దూరం!

SAతో తొలి టెస్టులో మెడనొప్పికి గురైన IND కెప్టెన్ గిల్ రెండో టెస్టుకు దూరమయ్యారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. తొలి టెస్టులో బ్యాటింగ్ ఆర్డర్ వైఫల్యంతో ఘోర ఓటమి మూటగట్టుకున్న భారత్‌కు గిల్ దూరమవడం పెద్ద ఎదురుదెబ్బని చెప్పవచ్చు. అతడి ప్లేస్‌లో BCCI సాయి సుదర్శన్‌ను తీసుకుంది. పంత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఈ నెల 22 నుంచి గువాహటిలో రెండో టెస్ట్ ప్రారంభం అవుతుంది.
News November 19, 2025
వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల సూచనలు

TG: చలి, పొగమంచు పెరుగుతుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశమున్న నేపథ్యంలో HYD ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు సూచనలు చేశారు. ‘నెమ్మదిగా నడుపుతూ అలర్ట్‌గా ఉండండి. మంచులో హైబీమ్ కాకుండా లోబీమ్ లైటింగ్ వాడండి. ఎదుటి వాహనాలకు సురక్షిత దూరాన్ని మెయిన్టైన్ చేయండి. సడెన్ బ్రేక్ వేస్తే బండి స్కిడ్ అవుతుంది. మొబైల్ వాడకుండా ఫోకస్డ్గా ఉండండి. వాహనం పూర్తి కండిషన్లోనే ఉందా అని చెక్ చేసుకోండి’ అని సూచించారు.
News November 19, 2025
దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న PM మోదీ

ప్రధాని మోదీ ఈ నెల 21 నుంచి 23 వరకు సౌత్ ఆఫ్రికాలో పర్యటించనున్నారు. 22, 23 తేదీల్లో నిర్వహించనున్న 20వ G-20 సదస్సులో ఆయన పాల్గొంటారని విదేశాంగ శాఖ ప్రకటించింది. ‘G-20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ జొహన్నెస్‌బర్గ్‌లో పర్యటించనున్నారు. ఈ సమ్మిట్‌లో ప్రధాని 3 సెషన్లలో ప్రసంగిస్తారు. వివిధ నేతలతోనూ భేటీ అవుతారు. ఇది ఓ గ్లోబల్ సౌత్ దేశంలో వరుసగా నాలుగోసారి జరుగుతున్న G-20 సదస్సు’ అని పేర్కొంది.


