News December 1, 2024
విమాన ప్రయాణం మరింత ప్రియం?

ఏవియేషన్ టర్బైన్ ఇంధనం(ATF) ధరను చమురు సంస్థలు నెల క్రితమే కిలోలీటర్‌కు రూ.2941 పెంచగా, దాన్ని తాజాగా మరో రూ.1318 పెంచాయి. దీంతో ప్రస్తుతం ఏటీఎఫ్ కిలోలీటర్ ధరలు ఢిల్లీలో రూ.91,856గా, కోల్‌కతాలో రూ.94,551గా, ముంబైలో రూ.85,861గా, చెన్నైలో రూ.95,231గా ఉన్నాయి. కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్లైట్ టిక్కెట్ల ధర కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News January 15, 2026
లోయర్ క్లాస్ జాబ్స్ కాదు బాబాయ్.. అసలైన డిమాండ్ వీరికే..

Ai దెబ్బకు భవిష్యత్‌లో వైట్ కాలర్ జాబ్స్ భారీగా తగ్గిపోతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్లంబర్, ఎలక్ట్రిషియన్, కార్పెంటర్.. లాంటి వృత్తులకు భారీ డిమాండ్ ఉంటుందని చెబుతున్నారు. వీటిని యువత లోయర్ క్లాస్ ఉద్యోగాలుగా చూస్తోందని, కానీ హై డిమాండ్ దృష్ట్యా వీటికే ఫ్యూచర్ ఉంటుందని అంటున్నారు. ప్రస్తుత రోజుల్లోనే ఓ ప్లంబర్ ఇంటికి వచ్చి చెక్ చేస్తే రూ.500 తీసుకుంటున్నాడని గుర్తు చేస్తున్నారు. COMMENT?
News January 15, 2026
ఆమిర్ ఖాన్ కొడుకు సినిమాలో హీరోయిన్‌గా సాయిపల్లవి

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ సరసన హీరోయిన్ సాయిపల్లవి నటిస్తున్నారు. ‘ఏక్ దిన్’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మే 1న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. రేపు టీజర్ రిలీజ్ కానుంది. సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఆమిర్ ఖాన్ ఓ నిర్మాతగా ఉన్నారు. కాగా సాయిపల్లవి రణ్‌బీర్ ‘రామాయణ’లోనూ నటిస్తుండగా ఈ మూవీ దీపావళికి రిలీజ్ కానుంది.
News January 15, 2026
ప్రెగ్నెన్సీ రావాలంటే వాటికి దూరంగా ఉండండి

చాలా మంది అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు పిల్స్ వాడుతుంటారు. కానీ ఇవి తరువాతి కాలంలోనూ ప్రెగ్నెన్సీ రాకుండా నిరోధించే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అందుకే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడానికి కనీసం రెండేళ్ల ముందు నుంచి, అలా వీలుకాకపోతే కనీసం 6 నెలలు ముందు నుంచి గర్భనిరోధక మాత్రలు వాడకపోవడం మంచిది. వీటితో పాటు దంపతులు ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తుల్ని మానేయాలని సూచిస్తున్నారు.


