News April 24, 2024
30 వారాల గర్భవిచ్ఛిత్తికి సుప్రీం అనుమతి
బాలిక గర్భం దాల్చిన కేసులో సుప్రీంకోర్టు అసాధారణ తీర్పు చెప్పింది. 30 వారాల గర్భాన్ని విచ్ఛిత్తి చేసుకునేందుకు అనుమతిచ్చింది. మహారాష్ట్రకు చెందిన 14 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురై గర్భం దాల్చింది. ఆలస్యంగా విషయం తెలుసుకున్న తల్లి బాలిక గర్భ విచ్ఛిత్తి కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ నిరాశ ఎదురవడంతో సుప్రీంకు వెళ్లారు. దీనిపై విచారణ జరిపిన CJI జస్టిస్ చంద్రచూడ్ గర్భవిచ్ఛిత్తికి అనుమతించారు.
Similar News
News November 20, 2024
48 గంటల్లోపే అకౌంట్లో డబ్బులు: మంత్రి
AP: ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు రూ.418 కోట్ల విలువైన ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తూ.గో, ప.గో, ఏలూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 1.81 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. ధాన్యం విక్రయించిన 24 నుంచి 48 గంటల్లోపే రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయన్నారు. రైతులు ఎప్పుడు, ఎక్కడైనా ధాన్యం అమ్ముకోవచ్చని సూచించారు.
News November 20, 2024
మహారాష్ట్రలోనూ ఓటేయనున్న రాష్ట్ర ఓటర్లు
TG: రాష్ట్రంలోని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని 12 గ్రామాల ప్రజలకు మహారాష్ట్రలోనూ ఓటు హక్కు ఉంది. పరందోళి, గౌరి, పద్మావతి, ముక్దంగూడ, బోటాపటార్, ఇసాపూర్, లెండిగూడ, ఇందిరానగర్, శంకర్ లొద్ది, మహారాజ్ గూడ, అంతాపూర్ ప్రజలకు రాజురా నియోజకవర్గంలో ఓటు హక్కు ఉంది. ఈ గ్రామాల్లో 3 వేలకుపైగా ఓటర్లు ఉన్నారు. కాగా రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దుగా ఉన్న కెరమెరి మండలం ఎప్పటి నుంచో వివాదంలో ఉంది.
News November 20, 2024
వారికి 500 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ: మంత్రి సవిత
AP: రాష్ట్రంలో మరమగ్గాలు ఉన్న వారికి 500 యూనిట్లు, చేనేత మగ్గాలు ఉన్నవారికి 200 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ అని మంత్రి సవిత తెలిపారు. హెల్త్ ఇన్సూరెన్స్, 5% GST రీయింబర్స్మెంట్ కల్పిస్తామని చెప్పారు. ‘కర్నూలు, విజయనగరంలో చేనేత శాలలు ఏర్పాటు చేస్తాం. ఇందుకు స్థానిక MPలు రూ.కోటి చొప్పున నిధులు కేటాయించారు. చేనేత వస్త్రాల మార్కెటింగ్ కోసం విదేశాల్లో ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేస్తాం’ అని ఆమె తెలిపారు.