News February 25, 2025

గర్భిణులు, బాలింతలు జాగ్రత్త!

image

AP: ‘జనని సురక్ష యోజన’ పథకం ద్వారా సాయం చేస్తామని గర్భిణులు, బాలింతలకు ఫేక్ లింక్‌లు, మెసేజ్‌లు పంపి సైబర్ నేరగాళ్లు డబ్బు కాజేస్తున్నారు. ఇలా కొందరు మోసపోతున్నట్లు బాపట్ల SP తుషార్ డూడీ వైద్య ఆరోగ్యశాఖకు సమాచారం ఇచ్చారు. కేటుగాళ్లు తొలుత అంగన్వాడీ, ANMల వివరాలు సేకరించి ఆపై బాలింతలు, గర్భిణుల ఫోన్ నంబర్లు రాబడుతున్నారు. వాళ్ల వాట్సాప్ నంబరుకు CM ఫొటో పెట్టుకొని నమ్మిస్తూ మోసం చేస్తున్నారు.

Similar News

News February 25, 2025

టెన్త్ మార్కులు ఎలా ఇద్దాం?.. విద్యాశాఖ కసరత్తు

image

TG: ఈ ఏడాది నుంచి టెన్త్ మార్కుల విధానం మారనుంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న గ్రేడింగ్‌ విధానాన్ని ఎత్తివేయగా ఆ స్థానంలో దేన్ని అమలు చేయాలనే దానిపై విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మార్కులను బట్టి పాస్, ఫెయిల్ అని ఇవ్వాలా? లేక ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ కేటగిరీలుగా ఇవ్వాలా? అని నిన్నటి సమావేశంలో చర్చించారు. అయితే ఎటూ క్లారిటీ రాకపోవడంతో త్వరలో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు.

News February 25, 2025

అకౌంట్లలో డబ్బులు.. సీఎం కీలక ప్రకటన

image

TG: మార్చి 31లోపు అన్నదాతల అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పటివరకు 3 ఎకరాల లోపు ఉన్న రైతులకు నిధులు జమ చేసింది. ఇకపై మిగతావారికీ అందజేస్తామని సీఎం వెల్లడించారు. కాగా తొలుత ఎకరం వరకు ఉన్న 17 లక్షల మందికి రూ.557.54Cr, రెండెకరాల వరకు ఉన్న 13.23 లక్షల మందికి రూ.1130.29Cr, మూడెకరాల వరకు ఉన్న 9.56 లక్షల మందికి రూ.1230.98Cr ఖాతాల్లో వేశారు.

News February 25, 2025

ఇంటర్ హాల్ టికెట్లు విడుదల.. త్వరలో మొబైల్స్‌కు లింకులు

image

TG: ఇంటర్ హాల్ టికెట్లను రిలీజ్ చేసినట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. కాలేజీల లాగిన్‌లలో హాల్ టికెట్లు అప్‌లోడ్ చేసినట్లు పేర్కొన్నారు. అతి త్వరలోనే విద్యార్థుల మొబైల్ నంబర్లకు హాల్ టికెట్ల డౌన్లోడ్ లింకును పంపిస్తామన్నారు. మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానుండగా 9.5 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

error: Content is protected !!