News April 13, 2025
అటు ప్రీతి జింటా, ఇటు కావ్యా మారన్(VIRAL)

SRH-PBKS మ్యాచ్ సందర్భంగా ఆయా జట్ల ఓనర్లు కావ్యా మారన్, ప్రీతి జింటా ఉప్పల్‌లో సందడి చేశారు. తమ ప్లేయర్లు సిక్సర్లు, ఫోర్లు కొట్టినప్పుడు, వికెట్లు పడినప్పుడు వారు ఇచ్చిన హావభావాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అభిషేక్ శర్మ సెంచరీ చేయగానే కావ్యా అతని పేరెంట్స్ దగ్గరికెళ్లి అభినందనలు తెలిపారు. మ్యాచ్ తర్వాత అభిషేక్ ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్‌ను గుర్తుచేస్తూ ప్రీతి కంగ్రాట్స్ చెప్పడం విశేషం.
Similar News
News April 14, 2025
నేటి నుంచి భారీ స్థాయిలో జాబ్ నోటిఫికేషన్లు: మంత్రులు

TG: ఇకపై విద్య, <<16093517>>ఉద్యోగాల్లో<<>> SC వర్గీకరణ అమలు అవుతుందని మంత్రులు దామోదర, ఉత్తమ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. SC వర్గీకరణ నేటి నుంచి అమల్లోకి వస్తుందని, నేటి నుంచి భారీ స్థాయిలో జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం జారీ చేసే అన్ని జాబ్ నోటిఫికేషన్లకు SC వర్గీకరణ వర్తిస్తుందన్నారు. SC వర్గీకరణ గురించి చాలా పార్టీలు మాట్లాడాయని, కానీ దాని కోసం ప్రయత్నం చేయలేదని అన్నారు.
News April 14, 2025
రేపు CLP సమావేశం.. 4 అంశాలపై చర్చ

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభా పక్షం రేపు సమావేశం కానుంది. శంషాబాద్ నోవాటెల్‌లో ఉ.11 గంటల నుంచి జరగనున్న ఈ భేటీలో 4 అంశాలపై చర్చించనున్నారు. భూ భారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, SC-ST వర్గీకరణపై చర్చ జరగనుంది. ఈ మేరకు పార్టీ MLAలు, MLCలకు ప్రభుత్వ విప్‌లు సమాచారం ఇచ్చారు.
News April 14, 2025
రాజ్యాంగాన్ని కాంగ్రెస్ బుజ్జగింపు సాధనంగా వాడింది: మోదీ

కాంగ్రెస్ తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని బుజ్జగింపు సాధనంగా వాడిందని ప్రధాని మోదీ విమర్శించారు. హస్తం పార్టీ తన అధికారానికి ముప్పు ఉందని భావించినప్పుడల్లా దేశ అత్యున్నత శాసనాన్ని తుంగలో తొక్కేదని నొక్కిచెప్పారు. రాజ్యాంగంతో దేశంలో సామాజిక న్యాయం జరుతుందని భావించిన అంబేడ్కర్ ఆశయాలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని మండిపడ్డారు. హరియాణాలో హిసార్ విమానాశ్రయంలో ప్లాంటును PM ప్రారంభించారు.