News August 21, 2024

ఏ విచారణకైనా సిద్ధం: MLC బొత్స

image

AP: ఇప్పటికీ విశాఖ రాజధాని అనేది తమ పార్టీ విధానమని YCP MLC బొత్స సత్యనారాయణ వెల్లడించారు. శాసనమండలిలో ఛైర్మన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ‘పార్టీలో ఒడుదొడుకులు సహజం. ఆందోళన వద్దు. పార్టీలోకి కొత్త నీరు వస్తుంది. పాత నీరు పోతుంది. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. YCP నేతలపై దాడులు ఆపాలి. మా పాలనపై ఏ విచారణకైనా సిద్ధం. ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి’ అని డిమాండ్ చేశారు.

Similar News

News February 12, 2025

APPLY NOW.. నెలకు రూ.3000

image

చిన్న, సన్న కారు రైతులను ఆర్థికంగా ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన. ఈ పథకం ద్వారా 60 ఏళ్లు నిండిన రైతులకు నెలకు రూ.3000 పెన్షన్ ఇస్తారు. 18 నుంచి 40 ఏళ్లలోపు వయసున్న రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు. నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు ప్రీమియం చెల్లించాలి. ఒక వేళ రైతు చనిపోతే అతని భార్యకు నెలకు రూ.1500 పెన్షన్ ఇస్తారు. దరఖాస్తు చేసేందుకు ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News February 12, 2025

BCలకు సీఎం క్షమాపణలు చెప్పాలి: KTR

image

TG: బీసీల జనాభాను తగ్గించి వారిని తీవ్ర మానసిక వేదనకు గురిచేసిన CM రేవంత్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని KTR డిమాండ్ చేశారు. ‘సర్వే తప్పులతడక అని ప్రభుత్వం ఒప్పుకోవడాన్ని స్వాగతిస్తున్నాం. <<15441710>>ఈసారైనా <<>>సమగ్రంగా సర్వే చేసి BCలకు 42% రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలు జరపాలి. BC డిక్లరేషన్‌లో ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వరకూ కాంగ్రెస్‌ను BCలెవరూ నమ్మరని సీఎం గుర్తుపెట్టుకోవాలి’ అని KTR ట్వీట్ చేశారు.

News February 12, 2025

అమెరికాకు పయనమైన ప్రధాని మోదీ

image

ఫ్రాన్స్ పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ అక్కడి నుంచి అమెరికాకు బయలుదేరారు. యూఎస్‌లో ఆయన రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ట్రంప్ ఆ దేశాధ్యక్షుడయ్యాక మోదీకి ఇదే తొలి పర్యటన. ఈ సందర్భంగా అక్కడి వ్యాపారవేత్తలు, భారత ప్రవాసుల్ని ఆయన కలవనున్నారు. ఆర్థిక, సాంకేతిక, రక్షణ రంగాల్లో ఇరు దేశాల బంధం మరింత బలోపేతం చేసుకునే దిశగా మోదీ, ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారని అధికార వర్గాలు తెలిపాయి.

error: Content is protected !!