News July 31, 2024
అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవండి: సోనియా
దేశంలో త్వరలో జరగనున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని కాంగ్రెస్ నేతలకు సోనియా గాంధీ పిలుపునిచ్చారు. పార్టీ పార్లమెంటరీ సమావేశంలో ఆమె మాట్లాడారు. అతి నమ్మకం పనికిరాదని, కష్టపడి పనిచేస్తే లోక్‌సభ ఫలితాలే రిపీట్ అవుతాయని చెప్పారు. విభజన రాజకీయాలను ప్రజలు తిరస్కరించినా మోదీ ప్రభుత్వంలో మార్పు రాలేదన్నారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలు పార్లమెంట్ సెషన్స్‌కు మిస్ కావొద్దని సూచించారు.
Similar News
News February 2, 2025
16 మంది ఎంపీలున్న చంద్రబాబు ఏం సాధించారు?: బుగ్గన
కేంద్ర బడ్జెట్‌లో APకి నిధులు రాబట్టడంతో CM చంద్రబాబు విఫలమయ్యారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. 12 మంది MPలతోనే బిహార్ CM నితీశ్ అధిక నిధులు సాధించారని, 16 మంది MPలున్నప్పటికీ CBN అసమర్థుడిగా మిగిలారని మండిపడ్డారు. ‘పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల ఎత్తుకే పరిమితం చేశారు. నిర్మాణంలో ఉన్న పోర్టులకు నిధులు కోరలేదు. మెడికల్ కాలేజీల విషయంలోనూ నిర్లక్ష్యం వహించారు’ అని దుయ్యబట్టారు.
News February 2, 2025
రేటింగ్ కోసం లంచాలు.. KL యూనివర్సిటీపై కేసు
AP: గుంటూరు జిల్లాలోని KL యూనివర్సిటీపై CBI కేసు నమోదు చేసింది. NAAC రేటింగ్స్ కోసం లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు రావడంతో దేశ వ్యాప్తంగా 20 చోట్ల విద్యాసంస్థల్లో సోదాలు చేపట్టి యూనివర్సిటీ ఉద్యోగులు, NAAC సిబ్బందిని అదుపులోకి తీసుకుంది. నగదు, బంగారం, సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల రూపంలో లంచాలు ఇచ్చినట్లు గుర్తించింది. రూ.37 లక్షల నగదు, 6 ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు, పలు డాక్యుమెంట్లను CBI స్వాధీనం చేసుకుంది.
News February 2, 2025
సుమతీ నీతి పద్యం- తాత్పర్యం
అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుటకంటెన్
వడిగల యెద్దలగట్టుక
మడి దున్నుకబ్రతుకవచ్చు మహిలో సుమతీ!
తాత్పర్యం: అడిగిన జీతం ఇవ్వని గర్వంతో కూడిన యజమాని వద్ద ఉండటం కంటే వేగంగా పోయే ఎద్దులను నాగలికి కట్టుకుని వ్యవసాయం చేయడం మంచిది.