News October 20, 2024
ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం.. కానీ: జూడాలు

బెంగాల్లో జూడాలు ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమయ్యారు. అయితే తమ నిరాహార దీక్షను విరమించేది లేదని స్పష్టం చేశారు. కోల్‌కతా లేడీ ట్రైనీ డాక్టర్ రేప్&మర్డర్ కేసులో న్యాయం చేయాలని కోరుతూ వాళ్లు దీక్ష చేస్తున్నారు. అయితే వారి డిమాండ్లలో చాలావరకు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం మమత అంటున్నారు. కాగా హెల్త్ సెక్రటరీని తొలగించేందుకు మాత్రం ఆమె ఒప్పుకోకపోవడంతో వివాదానికి ముగింపు పడట్లేదు.
Similar News
News March 15, 2025
హిందీ భాషపై కామెంట్స్.. పవన్‌పై వైసీపీ విమర్శలు

AP: జయకేతనం సభలో ‘హిందీ మన భాషే కదా?’ అన్న పవన్ <<15763560>>కళ్యాణ్‌పై<<>> YCP విమర్శలు గుప్పిస్తోంది. అప్పట్లో ‘హిందీ గో బ్యాక్’ అనే పేపర్ ఆర్టికల్‌ను పవన్ ట్వీట్ చేయడాన్ని గుర్తుచేస్తోంది. ఆ ఆర్టికల్‌పై స్పందించిన ఆయన ‘నార్త్ ఇండియా రాజకీయ నేతలు మనదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని అర్థం చేసుకొని, గౌరవించాలి’ అని రాసుకొచ్చారు. మరి ఇప్పుడేమో జనసేనానికి హిందీపై ప్రేమ పుట్టుకొచ్చిందా? అంటూ ప్రశ్నలు సంధిస్తోంది.
News March 15, 2025
నిద్రలేమితో అనారోగ్యమే!

మనిషికి నిద్ర చాలా ముఖ్యమైనది. తగినంత నిద్రలేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గురక నిద్రలేమికి సంకేతమని చెబుతున్నారు. నిద్రలేమితో కుంగుబాటు, ఆందోళన వంటి సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. సరైన నిద్ర ఉంటే 30-60% రోగుల్లో ఆల్జీమర్స్, గుండె జబ్బులు తగ్గుతున్నాయని తెలిపారు. ఏకధాటిగా 6-8 గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నారు.
News March 15, 2025
గ్రూప్-3లో ఫస్ట్ ర్యాంక్ ఎవరికంటే?

TG: నిన్న వెలువడిన గ్రూప్-3 ఫలితాల్లో మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన అర్జున్ 339.239 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఈయన గ్రూప్-2లో స్టేట్ 18వ ర్యాంక్ సాధించడం గమనార్హం. మొత్తం 2,67,921 మంది పరీక్షలు రాయగా 2,49,557 మందికి జనరల్ ర్యాంకింగ్ లిస్టులను రిలీజ్ చేశారు. టాప్-10లో ఒక్కరు మాత్రమే అమ్మాయి ఉండటం గమనార్హం. మొత్తంగా టాప్-100లో 12 మంది అమ్మాయిలు ఉన్నారు.