News January 17, 2025

ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రతిపాదనలు సిద్ధం చేయండి: CBN

image

AP: పేదలకు ఇళ్ల స్థలాలపై క్యాబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ‘పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి’ అని అధికారులకు సూచించారు. అలాగే రానున్న ఆర్థిక సంవత్సరంలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా అమలుకు సిద్ధం కావాలని చెప్పారు. ఇక పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం వెంటనే ప్రారంభిస్తామని సీఎం వెల్లడించారు.

Similar News

News November 25, 2025

దివ్యాంగులకు స్వయం సహాయక సంఘాలు.. వచ్చే నెల 3న ఏర్పాటు

image

TG: రాష్ట్రంలో దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు కానున్నాయి. డిసెంబరు 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వీటిని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. గత నెలలో గ్రామాల్లో మహిళా సమాఖ్యల ద్వారా లక్షన్నర మంది దివ్యాంగ మహిళలు, పురుషులను సెర్ప్‌ గుర్తించింది. మహిళల అధ్యక్షతన ఒక్కో స్వయం సహాయక సంఘంలో 5 నుంచి 10 మంది వరకు సభ్యులు ఉండాలని నిర్దేశించింది.

News November 25, 2025

పీరియడ్స్ రావట్లేదా..? అయితే జాగ్రత్త

image

కొంతమందికి ప్రతినెలా పీరియడ్స్ రావు. దానికి వ్యాధులు, తీవ్ర ఒత్తిడి, అనారోగ్యం, బరువు హఠాత్తుగా పెరగడం లేదా తగ్గడం వంటివి కారణం కావచ్చంటున్నారు నిపుణులు. ఏ కారణంతో పీరియడ్స్ రావడం లేదో వైద్యులను సంప్రదించి తెలుసుకోవడం చాలా అవసరం. పీరియడ్స్ మీ ఆరోగ్య స్థితికి అద్దంపడతాయి. కాబట్టి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే ఏదో అంతర్లీన సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. వెంటనే తగిన వైద్యం తీసుకోవడం చాలా ముఖ్యం.

News November 25, 2025

డిసెంబర్ 6న డల్లాస్‌లో మంత్రి లోకేశ్ పర్యటన

image

AP: రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో మంత్రి లోకేశ్ DEC 6న USలోని డల్లాస్‌లో పర్యటించనున్నారు. గార్లాండ్ కర్టిస్ కల్వెల్ సెంటర్‌లో జరిగే భారీ సభలో ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రాభివృద్ధికి చేయూత ఇవ్వాలని వారిని కోరనున్నారు. ఈ సభకు US, కెనడా నుంచి 8,000 మంది వస్తారని అంచనా. దీని తర్వాత 8, 9 తేదీల్లో శాన్‌ఫ్రాన్సిస్కోలో పలు కంపెనీల ప్రతినిధులతో లోకేశ్ భేటీ అవుతారు.